IND vs WI : ఐసీసీ షాక్‌.. గెలిచిన వెస్టిండీస్‌కు 10, ఓడిన టీమిండియాకు 5 శాతం జ‌రిమానా.. ఎందుకో తెలుసా..?

ఇటు ఓట‌మి బాధ‌లో ఉన్న టీమ్ఇండియాకు అటు గెలిచిన జోష్‌లో ఉన్న వెస్టిండీస్ జ‌ట్టుకు అంత‌ర్జాతీయ క్రికెట్ మండ‌లి (ICC) షాకిచ్చింది. టీమ్ఇండియా ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో ఐదు శాతం, వెస్టిండీస్ ఆట‌గాళ్ల మ్యాచ్ ఫీజులో 10 శాతం జ‌రిమానా గా విధించింది.

IND vs WI

India vs West Indies : ఇటు ఓట‌మి బాధ‌లో ఉన్న టీమిండియాకు అటు గెలిచిన జోష్‌లో ఉన్న వెస్టిండీస్ జ‌ట్టుకు అంత‌ర్జాతీయ క్రికెట్ మండ‌లి (ICC) షాకిచ్చింది. టీమిండియా ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో ఐదు శాతం, వెస్టిండీస్ ఆట‌గాళ్ల మ్యాచ్ ఫీజులో 10 శాతం జ‌రిమానా గా విధించింది. తొలి టీ20లో ఇరు జ‌ట్లు స్లో ఓవ‌ర్ ను న‌మోదు చేయ‌డ‌మే అందుకు కార‌ణం.

కనీస ఓవర్ రేట్‌కు సంబంధించి ఆటగాళ్లు,ప్లేయర్ సపోర్ట్ పర్సనల్ కోసం ICC ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం.. ఆటగాళ్లు నిర్ణీత సమయంలో బౌలింగ్ చేయడంలో విఫలమైన ప్రతి ఓవర్‌కు వారి మ్యాచ్ ఫీజులో ఐదు శాతం జరిమానా విధించబడుతుంది. అయితే జ‌రిమానా మొత్తం మ్యాచ్ ఫీజులో 50 శాతం దాట‌కూడ‌దు.

IND vs WI : బ్యాటింగ్‌కు వెళ్లిన‌ చాహ‌ల్‌ను వెన‌క్కి పిలిచిన పాండ్య.. రూల్స్ ఒప్పుకోవ‌న్న అంపైర్లు.. ఆ మాత్రం తెలియ‌దా..!

నిర్ణీత స‌మ‌యానికి భార‌త జ‌ట్టు ఒక ఓవ‌ర్‌ను త‌క్కువ‌గా వేయ‌గా వెస్టిండీస్ జ‌ట్టు రెండు ఓవ‌ర్ల‌ను త‌క్కువ‌గా వేసింది. నిబంధ‌న‌ల ప్ర‌కారం ఒక్క ఓవ‌ర్ త‌క్కువ‌గా వేసిన టీమ్ఇండియాకు ఐదు శాతం, రెండు ఓవ‌ర్లు త‌క్కువ‌గా వేసిన వెస్టిండీస్‌కు ప‌ది శాతం ఫైన్‌ను ICC ఎలైట్ ప్యానెల్ ఆఫ్ మ్యాచ్ రిఫరీలకు చెందిన రిచీ రిచర్డ్‌సన్ వేశారు. తాము చేసిన నేరాల‌ను, జ‌రిమానాల‌ను పాండ్య‌, పావెల్‌లు అంగీక‌రించార‌ని ఐసీసీ విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది.

RCB : క‌ప్పులు గెలిపించే కోచ్ వ‌చ్చాడు.. ఆర్‌సీబీ రాత మారుస్తాడా..?

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 149 ప‌రుగులు చేసింది. అనంత‌రం ల‌క్ష్య ఛేద‌న‌లో భార‌త్ 9 వికెట్ల న‌ష్టానికి 145 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. తిల‌క్ వ‌ర్మ‌ (39), సూర్య‌కుమార్ యాద‌వ్‌ (21)లు ఫ‌ర్వాలేద‌నిపించ‌గా మిగిలిన వారు విఫ‌లం కావ‌డంతో 4 ప‌రుగుల తేడాతో భార‌త్‌కు ఓట‌మి త‌ప్ప‌లేదు. ఫ‌లితంగా ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో భార‌త్ 0-1 తేడాతో వెనుక‌బ‌డి ఉంది. ఇరు జ‌ట్ల మ‌ధ్య రెండో టీ20 మ్యాచ్ ఆదివారం గ‌యానాలోని ప్రొవిడెన్స్‌లో జ‌ర‌గ‌నుంది.

ట్రెండింగ్ వార్తలు