RCB : క‌ప్పులు గెలిపించే కోచ్ వ‌చ్చాడు.. ఆర్‌సీబీ రాత మారుస్తాడా..?

ప్ర‌తీసారి క‌ప్పు మ‌న‌దే అంటూ రావ‌డం ఉసూరుమ‌నిపించ‌డం.. రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు(RCB )కి అల‌వాటుగా మారింది. ఐపీఎల్ 2023 సీజ‌న్‌లోనూ అదే పున‌రావృత‌మైంది. బెంగ‌ళూరు ప‌లు క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకుంది. కెప్టెన్‌ను మార్చిన ఫ‌లితం లేక‌పోవ‌డంతో ఈ సారి కోచింగ్ స్టాప్‌పై వేటు వేసింది.

RCB head coach Andy Flower

RCB head coach Andy Flower : ప్ర‌తీసారి క‌ప్పు మ‌న‌దే అంటూ రావ‌డం ఉసూరుమ‌నిపించ‌డం.. రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు(RCB )కి అల‌వాటుగా మారింది. ఐపీఎల్ 2023 సీజ‌న్‌లోనూ అదే పున‌రావృత‌మైంది. స్టార్ ఆట‌గాళ్లు ఉన్న‌ప్ప‌టికీ ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క‌సారి కూడా క‌ప్పును ముద్దాడ‌లేదు ఆర్‌సీబీ. క‌నీసం వ‌చ్చే సీజన్‌లోనైనా ఐపీఎల్ ట్రోఫీని అందుకోవాల‌ని భావిస్తున్న బెంగ‌ళూరు ప‌లు క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకుంది. కెప్టెన్‌ను మార్చిన ఫ‌లితం లేక‌పోవ‌డంతో ఈ సారి కోచింగ్ స్టాప్‌పై వేటు వేసింది.

హెడ్‌కోచ్ సంజ‌య్ బంగ‌ర్‌(Sanjay Bangar)ను తొల‌గించింది. అత‌డి స్థానంలో జింబాబ్వే మాజీ ఆట‌గాడు ఆండీ ఫ్ల‌వ‌ర్‌(Andy Flower)ను నియ‌మించింది. అంతేకాదు.. డైరక్టర్‌ ఆఫ్‌ క్రికెట్‌ మైక్ హెస్సన్(Mike Hesson)కు వీడ్కోలు ప‌లికింది. అయితే.. అత‌డి స్థానంలో ఇంకా ఎవ‌రిని నియ‌మించ‌లేదు.

IND vs WI : బ్యాటింగ్‌కు వెళ్లిన‌ చాహ‌ల్‌ను వెన‌క్కి పిలిచిన పాండ్య.. రూల్స్ ఒప్పుకోవ‌న్న అంపైర్లు.. ఆ మాత్రం తెలియ‌దా..!

‘ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌. టీ20 ప్ర‌పంచ కప్ విన్నింగ్ కోచ్ ఆండీ ఫ్ల‌వ‌ర్‌ను ఆర్‌సీబీ పురుషుల జ‌ట్టు ప్ర‌ధాన కోచ్ నియ‌మించాం. ఆండీకి ఐపీఎల్‌తో పాటు ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న టీ20 లీగుల్లో ప‌ని చేసిన అనుభ‌వం ఉంది. అత‌డి మార్గ‌నిర్దేశంలో పీఎస్ఎల్, ఐఎల్‌టీ20 , ది హండ్రెడ్, అబుదాబి టీ10 లీగుల్లోని జ‌ట్లు టైటిల్ విజేత‌గా నిలిచాయి. ఛాంపియన్‌షిప్ గెలిచే మనస్తత్వాన్ని ఆర్‌సీబీలో పెంపొందించి జ‌ట్టును ముందుకు తీసుకువెళ‌తార‌ని ఆశిస్తున్నాం.’ అంటూ ఆర్‌సీబీ ట్వీట్ చేసింది.

కాగా.. ఆండీ ఫ్ల‌వ‌ర్ కోచింగ్‌లో ఇంగ్లాండ్ జ‌ట్టు తొలిసారి 2010లో టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ను అందుకున్న సంగ‌తి తెలిసిందే.

gukesh surpasses anand : ఇండియా టాప్ చెస్ క్రీడాకారుడిగా గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేష్…విశ్వనాథన్ ఆనంద్ రికార్డు బద్దలు

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు డైరెక్టర్‌ ఆఫ్‌ క్రికెట్‌గా పనిచేసిన మైక్‌ హసన్ మాట్లాడుతూ.. ఆర్‌సీబీ జ‌ట్టు గ‌త నాలుగు సీజ‌న్ల‌లో మూడు సార్లు ప్లే ఆఫ్స్ కు చేరుకుంది. అయితే.. అభిమానులు, ఆట‌గాళ్లు, స‌హ‌య సిబ్బంది, మ‌న‌మంతా కోరుకున్న విధంగా జ‌ట్టు క‌ప్పును ముద్దాడ‌లేక‌పోయింది. ఆర్‌సీబీని వీడ‌డం నిరాశ‌కు గురి చేస్తోంద‌న్నారు.ఎన్నో మ‌ధుర జ్ఞాప‌కాలు ఉన్నాయని, గొప్ప గొప్ప వ్య‌క్తుల‌తో ప‌ని చేసే అవ‌కాశం వ‌చ్చిందన్నారు. ఆర్‌సీబీకి, జ‌ట్టు కొత్త కోచింగ్ బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.

Tilak Varma: అరంగేట్రంలోనే అదరగొట్టేశాడు.. తిలక్ వర్మ సూపర్ బ్యాటింగ్.. సూపర్ క్యాచ్.. వీడియోలు వైరల్

ట్రెండింగ్ వార్తలు