Shah Rukh Khan : కింగ్ ఖాన్‌ చేతిలో వ‌న్డే ప్ర‌పంచక‌ప్‌.. నెట్టింట ఫ్యాన్స్ ర‌చ్చ‌

నాలుగేళ్ల‌కు ఒక‌సారి జ‌రిగే వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్(ODI World Cup) కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ ఏడాది భార‌త్ వేదిక‌గా వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌ర‌గ‌నుంది. అక్టోబ‌ర్ 5న ఈ మెగా టోర్నీ ఆరంభం కానుంది.

Shah Rukh Khan With World Cup Trophy

Shah Rukh Khan With World Cup Trophy : నాలుగేళ్ల‌కు ఒక‌సారి జ‌రిగే వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్(ODI World Cup) కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ ఏడాది భార‌త్ వేదిక‌గా వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌ర‌గ‌నుంది. అక్టోబ‌ర్ 5న ఈ మెగా టోర్నీ ఆరంభం కానుంది. కాగా.. విజేత‌కు ఇచ్చే ప్ర‌పంచ‌క‌ప్ ట్రోఫీని బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) చేతిలో ప‌ట్టుకుని ఉన్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోను ఐసీసీ (ICC) త‌న సోష‌ల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. “కింగ్ ఖాన్ చేతిలో సీడ‌బ్ల్యూటీసీ 23 ట్రోఫీ.. మ‌రింత ద‌గ్గ‌ర‌గా” అంటూ ఆ ఫోటోకు క్యాప్ష‌న్ ఇస్తూ ట్వీట్ చేసింది. ప్ర‌స్తుతం ఈ ఫోటో వైర‌ల్‌గా మారింది. ఇంకేముంది షారుఖ్‌ ఖాన్ అభిమానుల‌తో పాటు క్రికెట్ అభిమానులు లైకులు, కామెంట్ల‌తో హోరెత్తిస్తున్నారు.

IND vs WI 2nd Test : విండీస్‌తో రెండో టెస్టు.. ఈ మ్యాచ్‌ ప్ర‌త్యేక‌త‌లు తెలుసా.. విరాట్‌కు 500వ మ్యాచ్ ఇంకా..

ప్ర‌పంచ క‌ప్ ట్రోఫీని ఈ సారి స్పేస్ లో లాంఛ్ చేయ‌డం విశేషం. బెలూన్ సాయంతో ట్రోఫీని నింగిలోకి పంపారు. భూమికి 1,20,000 అడుగుల ఎత్తులో ట్రోఫీని ఆవిష్కరించారు. నింగిలోకి పంపిన ట్రోఫీ నేరుగా న‌రేంద్ర మోదీ స్టేడియంలో దిగింది. ప్ర‌పంచ‌కప్ లో పాల్గొనే అన్ని దేశాల్లో ప్ర‌స్తుతం ఈ ట్రోఫీని ప్ర‌ద‌ర్శిస్తున్నారు. వ‌ర‌ల్డ్ క‌ప్ ప్రమోష‌న‌ల్‌లో భాగంగానే షారుఖ్ ఖాన్ ట్రోఫీతో దిగిన ఫోటోను ఐసీసీ పంచుకుంది.

SL Vs PAK 1st Test : బంతితో బ్యాట‌ర్ ప‌రుగు.. ర‌నౌట్ చేసేందుకు వెంట‌ప‌డిన కీప‌ర్‌.. నవ్వులే న‌వ్వులు.. వీడియో

మెగా టోర్నీకి సంబంధించిన షెడ్యూల్‌ను ఐసీసీ ఇప్ప‌టికే విడుద‌ల చేసింది. అక్టోబ‌ర్ 5 నుంచి న‌వంబ‌ర్ 19 వ‌ర‌కు ఈ టోర్నీ జ‌ర‌గ‌నుంది. ఆరంభ, ఫైన‌ల్ మ్యాచ్‌లు న‌రేంద్ర మోదీ స్టేడియంలో జ‌ర‌గ‌నున్నాయి. మొత్తం 10 జ‌ట్లు ఈ క‌ప్ కోసం పోటీప‌డ‌నున్నాయి. క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూసే భార‌త్‌, పాకిస్తాన్ మ్యాచ్ అక్టోబ‌ర్ 15న జ‌ర‌గ‌నుంది. స్వ‌దేశంలోనే ఈ సారి మెగా టోర్నీ జ‌ర‌గ‌నుండ‌డంతో టీమ్ఇండియా విజేత‌గా నిల‌వాల‌ని స‌గ‌టు భార‌త అభిమాని కోరుకుంటున్నాడు.

ట్రెండింగ్ వార్తలు