Michael Vaughan : అబ్బే కోహ్లీకి అంత సీన్ లేదు..! టెస్టుల్లో స‌చిన్ రికార్డును బ‌ద్ద‌లు కొట్టేది అత‌డే.. మైకెల్ వాన్‌

టెస్టు క్రికెట్‌లో అత్య‌ధిక ప‌రుగులు సాధించిన రికార్డు టీమ్ఇండియా దిగ్గ‌జ ఆట‌గాడు స‌చిన్ టెండూల్క‌ర్ పేరిట ఉంది.

Joe Root can overtake Sachin Tendulkar as top Test run scorer

Michael Vaughan – Joe Root : టెస్టు క్రికెట్‌లో అత్య‌ధిక ప‌రుగులు సాధించిన రికార్డు టీమ్ఇండియా దిగ్గ‌జ ఆట‌గాడు స‌చిన్ టెండూల్క‌ర్ పేరిట ఉంది. మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ 200 టెస్టుల్లో 15, 921 ప‌రుగులు చేశాడు. స‌చిన్ రికార్డుకు ద‌రిదాపుల్లో ప్ర‌స్తుతం ఎవ‌రూ లేరు. అయితే.. భ‌విష్య‌త్తులో స‌చిన్ రికార్డును బ్రేక్ స‌త్తా ఉన్న ఆట‌గాడు కేవ‌లం జో రూట్ కు మాత్ర‌మే ఉంద‌ని ఇంగ్లాండ్ మాజీ ఆట‌గాడు మైకెల్ వాన్ అన్నాడు. టీమ్ఇండియా స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లీ, న్యూజిలాండ్ స్టార్ ఆట‌గాడు కేన్ విలియ‌మ్స‌న్‌ల వ‌ల్ల కాద‌న్నాడు.

ప్ర‌స్తుతం క్రికెట్ ఆడుతున్న వారిలో ఇంగ్లాండ్ సీనియ‌ర్ ఆట‌గాడు జో రూట్ మాత్ర‌మే స‌చిన్ రికార్డుకు కాస్త ద‌గ్గ‌రిలో ఉన్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు 142 టెస్టులు ఆడిన రూట్ 11,490 ప‌రుగులు చేశాడు. వెస్టిండీస్‌తో జ‌రిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో రూట్ సెంచ‌రీ చేశాడు. అత‌డి టెస్టు కెరీర్‌లో ఇది 32వ సెంచ‌రీ. ఈ మ్యాచ్‌లో రూట్ 122 ప‌రుగులు చేసి.. టెస్టుల్లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాళ్ల జాబితాలో 8వ స్థానానికి చేరుకున్నాడు. ఈ క్ర‌మంలో వెస్టిండీస్ దిగ్గ‌జ ఆట‌గాడు శివ నారాయ‌ణ చంద్ర పాల్ ను అధిగ‌మించాడు. చంద్ర‌పాల్ 164 మ్యాచుల్లో 11,867 ప‌రుగులు చేశాడు.

Mohammed Shami : టీమ్ఇండియాలో ష‌మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవ‌రో తెలుసా..? బుమ్రా, సిరాజ్‌లు కానేకాదు..

రూట్ మ‌రో 60 ప‌రుగులు చేస్తే 12వేల ప‌రుగుల మైలురాయిని చేరుకుంటాడు. ఇంగ్లాండ్ త‌రుపున అత్య‌దిక ప‌రుగులు చేసిన ఆట‌గాడిగా నిలిచేందుకు రూట్‌కు మ‌రో 532 ప‌రుగులు అవ‌స‌రం. అలెస్ట‌ర్ కుక్ 12,473 ప‌రుగుల‌తో ప్ర‌స్తుతం ఇంగ్లాండ్ త‌రుపున అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాడిగా కొన‌సాగుతున్నాడు.

దీనిపైనే వాన్ స్పందించాడు. మ‌రికొద్ది రోజుల్లోనే ఇంగ్లాండ్ త‌రుపున అత్య‌ధిక ప‌రుగులు చేసిన బ్యాట‌ర్‌గా రూట్ నిలుస్తాడ‌ని వాన్ చెప్పాడు. భ‌విష్య‌త్తులో అత‌డు స‌చిన్ రికార్డును అధిగ‌మిస్తాడ‌న్న ధీమాను వ్య‌క్తం చేశాడు. గ‌తంలోలాగా అత‌డు ఆచితూచి ఆడ‌డం లేద‌ని, దూకుడుగా ప‌రుగులుచేస్తున్నాడ‌ని చెప్పాడు. కేన్‌, కోహ్లీలు స‌చిన్ రికార్డును అందుకోవ‌డం క‌ష్ట‌మేన‌న్నాడు. కాగా.. ప్ర‌స్తుతం కోహ్లీ (8,848), విలియ‌మ్స‌న్ (8,743) లు స‌చిన్ రికార్డుకు చాలా దూరంలో ఉన్నారు.

Gautam Gambhir : కోచ్‌గా తొలి మీడియా స‌మావేశం.. రోహిత్, కోహ్లీల‌ వ‌న్డే కెరీర్ గురించి గంభీర్ కీల‌క వ్యాఖ్య‌లు..

టెస్టు క్రికెట్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన టాప్‌-5 ఆట‌గాళ్లు..

స‌చిన్ టెండూల్క‌ర్ (భార‌త్‌) – 200 టెస్టుల్లో 15,921 ప‌రుగులు
రికీపాంటింగ్ (ఆస్ట్రేలియా) – 168 టెస్టుల్లో 13,378 ప‌రుగులు
జాక్వ‌స్ క‌లిస్ (ద‌క్షిణాఫ్రికా) – 166 టెస్టుల్లో 13,289 ప‌రుగులు
రాహుల్ ద్ర‌విడ్ (భార‌త్‌) – 164 టెస్టుల్లో 13,288 ప‌రుగులు
అలెస్ట‌ర్ కుక్ (ఇంగ్లాండ్‌) – 161 టెస్టుల్లో 12,472 ప‌రుగులు.

ట్రెండింగ్ వార్తలు