Hyderabad Rain : హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం

హైదరాబాద్‌లోని పలుచోట్ల వర్షం కురుస్తోంది. నైరుతి రుతుపవనాలు, బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో నగరంలోని పలు ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచి వర్షం కురిసింది.

Hyderabad Rain : హైదరాబాద్‌లోని పలుచోట్ల వర్షం కురుస్తోంది. నైరుతి రుతుపవనాలు, బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో నగరంలోని పలు ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచి వర్షం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్‎పేట్, యూసఫ్‎గూడ, క్రిష్ణానగర్, పంజాగుట్ట, మసబ్ ట్యాంక్, మెహిదీపట్నం, బేగంపేట్, ఎర్రగడ్డ, కూకట్‎పల్లి, సికింద్రాబాద్, జీడిమెట్ల పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. నగరంలో పలుచోట్ల రోడ్లన్నీ జలమయమయ్యాయి.

అల్పపీడన ప్రభావంతో మరో 2 రోజులు వర్షాలు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షాలు పడుతాయని పేర్కొంది. రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే, మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. అల్పపీడనం.. వాయవ్య బంగాళాఖాతం, పశ్చిమ బెంగాల్‌, ఉత్తర ఒడిశా తీర ప్రాంతాల్లో కొనసాగుతుంది.

రెండు, మూడు రోజుల్లో అల్పపీడనం మరింత బలపడనుంది. పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి, ఒడిసా, జార్ఖండ్‌, ఛత్తీస్గఢ్‌ ల మీదుగా పయనించే అవకాశం ఉంది. ఉపరితల ఆవర్తనం మధ్య ట్రోపోస్పియర్‌ స్థాయి వరకు వ్యాపించింది ఉంది. రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మంగళవారం మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ రూరల్‌, వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తేలికపాటి జల్లులు పడనున్నాయి.

ట్రెండింగ్ వార్తలు