విద్యార్థులతో కలిసి సరదాగా ఫుట్‌బాల్‌ ఆడిన సీఎం రేవంత్ రెడ్డి.. ఆట మధ్యలో ఆసక్తికర ఘటన

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి సరదాగా ఫుట్‌బాల్‌ ఆడారు. బంతిని గోల్ చేసేందుకు విద్యార్థులతో కలిసి పోటీపడ్డారు.

CM Revanth Reddy played Football with students

CM Revanth Reddy : లోక్ సభ ఎన్నికల్లో భాగంగా నెల రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొన్నారు. విరామం లేకుండా సభలు, సమావేశాలు, రోడ్ షోలలో పాల్గొని పార్టీ అభ్యర్థులను గెలిపించాలని రేవంత్ ప్రజలను కోరారు. ఎన్నికల ప్రచారానికి శనివారంతో తెరపడటంతో ఆదివారం రేవంత్ కాస్త రిలాక్స్ మూడ్ లోకి వెళ్లిపోయారు. ఇవాళ ఉదయం గచ్చిబౌలిలో విద్యార్థులతో కలిసి ఫుట్ బాల్ ఆడారు. వారితో పోటీ పడుతూ గోల్ కోట్టేందుకు రేవంత్ ప్రయత్నించారు.

Also Read : IPL 2024 : వామ్మో.. ఇదేం బౌలింగ్ బుమ్రా..! సునీల్ నరైన్‌కు దిమ్మ‌తిరిగింది.. వీడియో వైరల్

ఎన్ఎస్ యూఐ ఆధ్వర్యంలో గచ్చిబౌలి మైదానంలో ఫుట్ బాల్ టోర్నీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థులతో కలిసి రేవంత్ రెడ్డి ఫుట్ బాల్ ఆడారు. బంతిని గోల్ చేసేందుకు విద్యార్థులతో కలిసి పోటీపడ్డారు. సీఎం హోదాలో ఉండికూడా రేవంత్ రెడ్డి ఆటఆడే సమయంలో ఓ విద్యార్థిలా మారిపోయారు. ఆట మధ్యలో సీఎం షూ పాడైపోయాయి. అయినా మైదానంను వీడకుండా షూ లేకుండానే సాక్స్ లతో సీఎం రేవంత్ ఫుట్ బాల్ ఆడారు. సీఎం రేవంత్ విద్యార్థులతో కలిసి ఫుట్ బాల్ ఆడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వీడియోలను చూసిన నెటిజన్లు రేవంత్ ను అభినందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.