IND vs WI 2nd test : నిప్పులు చెరిగిన మ‌హ్మ‌ద్ సిరాజ్‌.. వెస్టిండీస్ 255 ఆలౌట్‌.. భార‌త్‌కు భారీ ఆధిక్యం

పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లోని క్వీన్స్ పార్క్ ఓవల్ మైదానంలో వెస్టిండీస్‌తో జ‌రుగుతున్న రెండో టెస్టులో భార‌త జ‌ట్టు ప‌ట్టుబిగించింది.

IND vs WI 2nd test

IND vs WI 2nd test-Mohammed Siraj : పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లోని క్వీన్స్ పార్క్ ఓవల్ మైదానంలో వెస్టిండీస్‌తో జ‌రుగుతున్న రెండో టెస్టులో భార‌త జ‌ట్టు ప‌ట్టుబిగించింది. వెస్టిండీస్ మొద‌టి ఇన్నింగ్స్‌లో 255 ఆలౌట్ కావ‌డంతో భార‌త్‌కు 183 ప‌రుగుల కీల‌క‌మైన ఆధిక్యం ల‌భించింది. విండీస్ బ్యాట‌ర్ల‌లో కెప్టెన్ బ్రాత్ వైట్‌(75)తో రాణించగా ట‌గ్ న‌రైన్ చంద్ర‌పాల్ (33), మెకంజీ(32)లు ఫ‌ర్వాలేద‌నించారు. భార‌త బౌల‌ర్ల‌లో మ‌హ్మ‌ద్ సిరాజ్(Mohammed Siraj) ఐదు వికెట్లు తీయ‌గా, ముకేశ్ కుమార్‌, ర‌వీంద్ర జ‌డేజా చెరో రెండు, ర‌విచంద్ర‌న్ అశ్విన్ ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు. భార‌త్ తొలి ఇన్నింగ్స్‌లో 438 ప‌రుగులు చేసింది.

IND-A vs PAK-A : దంచికొట్టిన పాకిస్తాన్ బ్యాట‌ర్లు.. భార‌త్ ముందు భారీ ల‌క్ష్యం

26 ప‌రుగులు 5 వికెట్లు

ఓవ‌ర్ నైట్ స్కోరు 229/5 తో నాలుగో రోజు ఆటను కొన‌సాగించిన వెస్టిండీస్ మ‌రో 26 ప‌రుగులు మాత్ర‌మే జోడించి మిగిలిన 5 వికెట్ల‌ను కోల్పోయింది. ఆట ఆరంభ‌మైన మొద‌టి ఓవ‌ర్‌లోనే ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో అథ‌నేజ్‌(37) ఎల్భీగా ఔట్ అయ్యాడు. దీంతో విండీస్ ఓవ‌ర్ నైట్ స్కోరు వ‌ద్దే ఆరో వికెట్ కోల్పోయింది.

చెల‌రేగిన సిరాజ్‌..

ఆ త‌రువాత నుంచి సిరాజ్ మాయ మొద‌లైంది. త‌న‌దైన పేస్‌తో విండీస్ బ్యాట‌ర్ల‌కు చుక్కలు చూపించాడు. వ‌చ్చిన బ్యాట‌ర్‌ను వ‌చ్చిన‌ట్లే పెవిలియ‌న్‌కు చేర్చాడు. మిగిలిన నాలుగు వికెట్లను అత‌డే ప‌డ‌గొట్టాడు. ఇషాంత్ కిష‌న్ క్యాచ్ అందుకోవ‌డంతో జేస‌న్ హోల్డ‌ర్‌(15) ఔట్ కాగా.. జోసెఫ్‌(4)ను ఎల్భీగా పెవిలియ‌న్‌గా చేర్చాడు. ఇక రోచ్‌(4), గ్యాబ్రియ‌ల్‌(0)ల‌ను వ‌రుస బంతుల్లో ఔట్ చేసి విండీస్ ఇన్నింగ్స్‌ను ముగించాడు. మొత్తంగా ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసి విండీస్ ప‌త‌నాన్ని శాసించాడు.

Aiden Markram : ప్రియురాలిని పెళ్లాడిన స‌న్‌రైజ‌ర్స్ కెప్టెన్.. అత్త బాగుందంటూ..!

అనంత‌రం భార‌త్ త‌న రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది.

ట్రెండింగ్ వార్తలు