India Vs SL : కోహ్లీ 100వ టెస్టు.. ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్

అభిమానులు నిరాశకు గురి కాకుండా ఉండేందుకు ఇతర ఏర్పాట్లు చేయనున్నామని వెల్లడించింది. తొలిటెస్టు మ్యాచ్ జరుగనున్న మొహాలీ, దాని చుట్టు పక్కల ప్రాంతాల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి...

Kohli’s 100th Test : టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ… వంద టెస్టు మ్యాచ్ ఆడబోతున్నాడు. శ్రీలంక జట్టుతో మ్యాచ్ లు జరుగనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం టీ 20 సిరీస్ కొనసాగుతోంది. మార్చి 04వ తేదీ నుంచి పంజాబ్ మొహలీ స్టేడియంలో టీమిండియా – భారత్ జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరుగుతోంది. ఇందుకు అన్నీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. కోహ్లీ ఎలా ఆడుతాడో చూడాలని అనుకుంటున్న క్రీడాభిమానులకు పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ చేదు వార్త వినిపించింది. కరోనా కారణంగా… తొలి టెస్టుకు ప్రేక్షకులను అనుమతించబోమని స్పష్టం చేసింది.

Read More : Ranji Trophy 2021-22 : కూతురు చనిపోయింది.. బాధను దిగమింగుకుని సెంచరీ చేశాడు, సలామ్ అంటున్న నెటిజన్లు

కానీ… అభిమానులు నిరాశకు గురి కాకుండా ఉండేందుకు ఇతర ఏర్పాట్లు చేయనున్నామని వెల్లడించింది. తొలిటెస్టు మ్యాచ్ జరుగనున్న మొహాలీ, దాని చుట్టు పక్కల ప్రాంతాల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీంతో స్టేడియానికి ప్రేక్షకులను అనుమతిస్తే.. సమస్యలు వస్తాయని పీసీఏ అపెక్స్ కౌన్సిల్ భావించింది. బీసీసీఐ నిబంధనల ప్రకారం… ఇరు జట్ల ఆటగాళ్లు, సహాయక సిబ్బంది మినహా… సాధారణ ప్రేక్షకులను మైదానంలోకి అనుమతించబోమని పీసీఏ ట్రెజరర్ ఆర్పీ సింగా తెలిపారు. కానీ..కోహ్లీ వందో టెస్టు కనుక… మైదానం వెలుపలి నుంచి తిలకించేలా భారీ స్క్రీన్లను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సందర్భంగా టెస్టు క్రికెట్లో అరుదైన మైలురాయిని అందుకోనున్న కోహ్లీని ఘనంగా సత్కరించాలని పీసీఏ అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు