iPhone Users : ఐఫోన్ యూజర్లకు గుడ్‌ న్యూస్.. ఇకపై ఇంట్లోనే మీ ఐఫోన్ సెల్ఫ్ రిపేర్ చేసుకోవచ్చు.. ఇదిగో ప్రాసెస్..!

iPhone Users : ఐపోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. మీ ఐఫోన్ పనిచేయడం లేదా? స్ర్కీన్ పగిలిపోయిందా? బ్యాటరీ దెబ్బతిన్నదా? అయితే డోంట్ వర్రీ.. మీ ఐఫోన్ రిపేర్ కోసం ఎక్కడికి వెళ్లనక్కర్లేదు.

iPhone Users : ఐపోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. మీ ఐఫోన్ పనిచేయడం లేదా? స్ర్కీన్ పగిలిపోయిందా? బ్యాటరీ దెబ్బతిన్నదా? అయితే డోంట్ వర్రీ.. మీ ఐఫోన్ రిపేర్ కోసం ఎక్కడికి వెళ్లనక్కర్లేదు. చక్కగా మీ ఇంట్లోనే కూర్చొని మీ ఐఫోన్ సెల్ఫ్ రిపేర్ చేసుకోవచ్చు. మాకు ఐఫోన్ రిపేర్ చేయడం తెలియదు కదా అంటారా? అందుకే కుపెర్టినో ఆధారిత టెక్ దిగ్గజం ఆపిల్ సెల్ఫ్ సర్వీస్ రిపేర్ ఫెసిలిటీని ప్రవేశపెట్టింది. తమ ఐఫోన్ యూజర్ల కోసం ఈ కొత్త ప్రొగ్రామ్ తీసుకొచ్చింది… ప్రస్తుతానికి ఈ ప్రొగ్రామ్ అమెరికాలోనే అందుబాటులో ఉంది. ఐఫోన్ యూజర్లు తమ దెబ్బతిన్న ఐఫోన్ ను వారి ఇంటి వద్దనే సెల్ఫ్ రిపేర్ చేసుకోవడానికి ఆపిల్ అనుమతినిస్తోంది. ఈ ప్రోగ్రామ్ కింద కంపెనీ ఆపిల్ సెల్ఫ్ సర్వీస్ రిపేర్ స్టోర్ ద్వారా రిపేర్ మాన్యువల్స్, ఐఫోన్ రియల్ స్పేర్ పార్ట్స్, టూల్స్ అందిస్తోంది. ప్రస్తుతానికి, ఈ సర్వీసు ప్రస్తుతం iPhoneలకు మాత్రమే అందుబాటులో ఉంది.

Apple సెల్ఫ్ సర్వీస్ రిపేర్.. యునైటెడ్ స్టేట్స్‌లో మాత్రమే అందుబాటులో ఉండగా.. ఈ ఏడాది చివర్లో యూరప్‌తో ప్రారంభమయ్యే ప్రోగ్రామ్ ఇతర దేశాలకు కూడా విస్తరిస్తుందని కంపెనీ వెల్లడించింది. ఆపిల్ కంపెనీకి భారత్ మార్కెట్ అతిపెద్ద మార్కెట్ కావడంతో మనదేశంలో అతి త్వరలో ఈ సర్వీసును ప్రారంభించే అవకాశం ఉంది. కొత్త ఆన్‌లైన్ Apple స్టోర్ యూజర్లు iPhone 12, iPhone 13 లైనప్‌లు iPhone SE (3వ జనరేషన్), స్క్రీన్, బ్యాటరీ కెమెరాను రిపేర్ చేయడంలో 200 కన్నా ఎక్కువ వేర్వేరు పార్టులకు టూల్స్ అందిస్తోంది. ఈ ఏడాదిలో చివరి నాటికి Apple సిలికాన్‌తో Mac కంప్యూటర్‌లలో రిపేర్ చేయడానికి వీలుగా మాన్యువల్‌లు, స్పేర్ పార్టులు, టూల్స్ చేర్చాలని కంపెనీ భావిస్తోంది.

Iphone Users Can Now Repair Their Phone’s Broken Screen, Damaged Battery At Home

ఐఫోన్‌ను ఎలా రిపేర్ చేయాలంటే? :
Apple ప్రొడక్టులను రిపేర్ చేయాలంటే.. కస్టమర్‌లు ముందుగా support.apple.com/self-service-repairలో రిపేర్ చేసే ప్రొడక్టుకు సంబంధించిన రిపేర్ మాన్యువల్‌ని రివ్యూ చేయాల్సి ఉంటుంది. అప్పుడు కస్టమర్లు Apple సెల్ఫ్ సర్వీస్ రిపేర్ స్టోర్‌ని సందర్శించవచ్చు. మీకు అవసరమైన పార్టులు, టూల్స్ ఆర్డర్ చేసుకోవాలి. ఇక టూల్ కిట్‌లో టార్క్ డ్రైవర్‌లు, రిపేర్ ట్రేలు, డిస్‌ప్లే, బ్యాటరీ ప్రెస్‌లు మరిన్ని ఉంటాయి. ఈ టూల్స్ కొనుగోలు చేయలేం అనుకునే కస్టమర్లు వాటిని $49కి అద్దెకు తీసుకోవచ్చు. వారానికి దాదాపు రూ. 3700 చెల్లించాల్సి ఉంటుంది.

Apple రిపేర్ ప్రొవైడర్ల నెట్‌వర్క్‌లో అందుబాటులో ఉన్న రిపేర్ పార్ట్స్ ఒకే ధరలో ఉన్నాయని ఆపిల్ వెల్లడించింది. మీకు అవసరమైన ఐఫోన్లలో రిపేర్ల కోసం.. రీసైక్లింగ్, రీప్లేస్ చేసిన భాగాన్ని తిరిగి ఇచ్చినప్పుడు కస్టమర్‌లు కూడా క్రెడిట్‌ను అందుకోవచ్చునని ఆపిల్ తెలిపింది. ఎలక్ట్రానిక్ డివైజ్ లను రిపేర్ చేయడంలో అనుభవం లేని కస్టమర్‌లు ఎవరైనా వారికి ఇప్పటికీ సమీపంలోని Apple స్టోర్‌ను సందర్శించే అవకాశాన్ని అందిస్తోంది. థర్డ్ పార్టీ రిపేర్ షాపులకు ఖరీదైన ఎలక్ట్రానిక్ ప్రొడక్టులను తీసుకెళ్లవద్దని ఆపిల్ తమ కస్టమర్లకు సూచిస్తోంది. ఎందుకంటే థర్డ్ పార్టీ రిపేర్ షాపువాళ్లు తరచుగా అసలైన పార్టులను తీసేసి వాటి స్థానంలో డెలికేట్ పార్టులను రిప్లేస్ చేస్తారని హెచ్చరిస్తోంది.

Read Also : iPhone 14 : ఆపిల్ నుంచి శాటిలైట్ కనెక్టవిటీతో iPhone 14 ఫోన్ వస్తోంది.. ఎప్పుడంటే?

ట్రెండింగ్ వార్తలు