IPL 2022 Disney+ Hotstar Plans : డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌‌‌లో IPL మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ ప్లాన్లు ఇవే.. ధర ఎంతంటే?

IPL 2022 Disney+ Hotstar Plans : ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభానికి సమయం ఆసన్నమైంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2022) మార్చి 26 నుంచి ప్రారంభం కానుంది.

IPL 2022 Disney+ Hotstar Plans : ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభానికి సమయం ఆసన్నమైంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2022) మార్చి 26 నుంచి ప్రారంభం కానుంది. ఐపీఎల్ సీజన్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మధ్య తొలి మ్యాచ్‌తో ప్రారంభం కానుంది. అన్ని IPL మ్యాచ్‌లు Disney+ Hotstar, JioTV యాప్‌లో లైవ్ స్ట్రీమింగ్ కానున్నాయి. మీరు ఐపీఎల్ క్రికెట్ అభిమాని అయితే.. ఇదే సరైన సమయం.. మీ ఇంట్లో టీవీ లేదా కేబుల్ కనెక్షన్ లేకుంటే, అన్ని IPL ప్లాన్‌లకు సరిపోయేలా Disney+ Hotstar ప్లాన్‌కు సబ్ స్ర్కిప్షన్ పొందవచ్చు. భారత ఐపీఎల్ యూజర్ల కోసం డిస్నీ ప్లస్ హాట్ ఐపీఎల్ ప్లాన్ల జాబితాను అందిస్తోంది. సూపర్ ప్యాక్, ప్రీమియం వార్షిక ప్యాక్, ప్రీమియం నెలవారీ ప్లాన్ ఇలా మొత్తం మూడు సబ్ స్ర్కిప్షన్ ప్లాన్లను అందిస్తోంది. ఏయే ప్లాన్లలో ఏయే బెనిఫిట్స్ ఉన్నాయో ఓసారి లుక్కేయండి.

భారత్‌లో డిస్నీ+ హాట్‌స్టార్ ప్లాన్‌ జాబితా :

– Disney+ Hotstar Rs 299 plan :  డిస్నీ+ హాట్‌స్టార్ రూ. 299 ప్లాన్‌లో అన్ని సినిమాలు, లైవ్ స్పోర్ట్స్, టీవీ, నాలుగు డివైజ్‌లకు యాక్సస్ చేసుకోవచ్చు. ఒక నెల పాటు స్పెషల్‌ షోలకు యాక్సెస్ పొందవచ్చు. 4K లేదా 2160 పిక్సెల్‌ల వీడియో క్వాలిటీ డాల్బీ 5.1 సపోర్ట్‌ అందిస్తుంది. ఈ ప్లాన్‌పై స్ట్రీమింగ్ అయ్యే మూవీలు, టీవీ షోలు, క్రీడలు లేదా ఏదైనా ఇతర కంటెంట్ యాడ్స్ ఫ్రీ కంటెంట్ చూడొచ్చు. మధ్యలో ఎలాంటి యాడ్స్ కనిపించవు.

– Disney+ Hotstar Rs 899 plan : డిస్నీ+ హాట్‌స్టార్ రూ. 899 ప్లాన్‌లోనూ అన్ని సినిమాలు, లైవ్ స్పోర్ట్స్, టీవీలో చూడొచ్చు. ఈ ప్లాన్‌లోనూ రెండు డివైజ్‌లకు ఏడాది పాటు స్పెషల్‌లకు యాక్సెస్‌ పొందవచ్చు. పూర్తి HD లేదా 1080 పిక్సెల్‌ల వీడియో క్వాలిటీ డాల్బీ 5.1 సపోర్ట్‌ని అందిస్తుంది. సబ్‌స్క్రైబర్‌లు ఈ ప్లాన్‌తో యాడ్స్ ఫ్రీ ఎక్స్ పీరియన్స్ పొందవచ్చు.

– Disney+ Hotstar Rs 1499 plan  : డిస్నీ+ హాట్‌స్టార్ రూ. 1499 ప్లాన్‌లోనూ అన్ని సినిమాలు, లైవ్ స్పోర్ట్స్, టీవీలో వీక్షించవచ్చు. నాలుగు డివైజ్‌లకు ఏడాది పాటు స్పెషల్‌లకు యాక్సెస్‌ చేసుకోవచ్చు. 4K లేదా 2160 పిక్సెల్‌ల వీడియో క్వాలిటీ డాల్బీ 5.1 సపోర్ట్‌ని అందిస్తుంది. ఈ ప్లాన్‌తో స్ట్రీమింగ్ అయ్యే మూవీలు, ప్రదర్శనలు, క్రీడలు లేదా ఏదైనా ఇతర కంటెంట్ యాడ్స్ లేకుండానే వీక్షించవచ్చు.

డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఎలా పొందాలంటే? :

మూడు Disney+ Hotstar ప్లాన్‌లలో ఏదైన ఒకదానిలో సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు. ఇందుకోసం మీరు నేరుగా అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లవచ్చు. మీరు డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ప్రత్యేకించి కొనుగోలు చేయడం ఇష్టం లేదా? అయితే మీరు OTT ప్లాట్‌ఫారమ్‌కు ఫ్రీగా యాక్సస్ పొందే అవకాశం ఉంది. మీరు చేయాల్సిందిల్లా మీరు టెలికం నెట్ వర్క్‌ల్లో Jio, Vi లేదా Airtel ప్లాన్‌లను ఎంచుకోవచ్చు. ఒక ఏడాది పాటు వరకు ఉచితంగా డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ పొందవచ్చు.

Read Also : Jio IPL Plans 2022 : ఐపీఎల్ 2022 కోసం జియో సరికొత్త ప్లాన్.. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌ చూడొచ్చు..! 

ట్రెండింగ్ వార్తలు