Jai Bheem : ‘జై భీమ్‌’లో సినతల్లి పాత్రలో ఒదిగిపోయిన నటి ఎవరో తెలుసా?

గిరిజన గర్భిణీ పాత్రలో కనిపించిన నటి పాత్ర పేరు ‘సినతల్లి’గా అందరి ప్రశంశలు అందుకుంటుంది. దీంతో చాలా మంది ప్రేక్షకులు ఆ సినతల్లి పాత్రలో నటించిన అమ్మాయి ఎవరు అని వెతికేస్తున్నారు.

Jai Bheem :  తమిళ్ స్టార్ హీరో సూర్య కమర్షియల్ సినిమాలతో పాటు నటనకి, కథకి ప్రాధాన్యం ఉన్న సినిమాలు కూడా చేస్తాడు. తాజాగా చంద్రూ అనే ఒక అడ్వకేట్ జీవిత చరిత్రని, ఒక కేసు విషయంలో నిస్వార్థంగా ఆయన చేసిన పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని ‘జై భీమ్’ సినిమాను చేశాడు సూర్య. ఈ సినిమా దీపావళి కానుకగా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయింది. సూర్య సొంత బ్యానర్లో ఈ సినిమాని నిర్మించాడు. ఈ సినిమాకి జ్ఞానవేల్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా గురించి అందరూ చాలా బాగా మాట్లాడుకుంటున్నారు. ‘జై భీమ్’లో నటించిన ప్రతి ఒక్కరికి మంచి పేరు వస్తుంది.

Funbucket Bhargav : మరోసారి జైలుకి వెళ్లిన ఫన్ బకెట్ భార్గవ్

ఓ కేసులో అరెస్టు అయిన తన భర్త కనిపించకపోవడంతో అతడిని కనిపెట్టేందుకు, అతడి మరణానికి కారణం తెలుసుకునేందుకు గర్భిణీ మహిళ ఓ లాయర్ తో కలిసి చేసిన పోరాటమే ఈ సినిమా కథ. ఈ సినిమాలో ఆ గిరిజన గర్భిణీ పాత్రలో కనిపించిన నటి పాత్ర పేరు ‘సినతల్లి’గా అందరి ప్రశంశలు అందుకుంటుంది. దీంతో చాలా మంది ప్రేక్షకులు ఆ సినతల్లి పాత్రలో నటించిన అమ్మాయి ఎవరు అని వెతికేస్తున్నారు.

Balakrishna : బాలయ్య సినిమాలో విలన్ గా కన్నడ స్టార్ హీరో

‘జై భీమ్‌’లో ‘సినతల్లి’గా లీడ్‌రోల్‌ పోషించిన ఆ నటి పేరు లిజోమోల్ జోస్. ఈమె మలయాళ నటి. కొన్నేళ్ల పాటు ఓ చానల్‌లో పని చేసింది. మాస్టర్స్‌ చదువుతున్న సమయంలో సినిమా ఆడిషన్స్‌కు ఫొటోలు పంపించగా ఫహద్‌ ఫాజిల్‌ నటించిన ‘మహాశింబే ప్రతీకారం’ మూవీతో వెండితెరకి పరిచయమైంది. ఈ సినిమాని తర్వాత తెలుగులో సత్యదేవ్ హీరోగా ఉగ్రరూపస్య ఉమామహేశ్వర గా తెరకెక్కించారు. ఆ తర్వాత ‘రిత్విక్‌ రోషన్‌’, ‘హనీ బీ 2.5’, ‘శివప్పు ముంజల్ పచ్చయి’ లాంటి సినిమాలతో వరుసగా హీరోయిన్ ఛాన్సులు దక్కించుకుంది. ఆమె నటనను చూసి జ్ఞానవేల్‌ ‘జై భీమ్‌’ సినిమాలో అవకాశం ఇచ్చారు. ఈ సినిమాలో కంప్లీట్ డి గ్లామర్ రోల్ లో నటించాలి. ఇందుకోసం లీజో తనని తాను మేకోవర్‌ చేసుకొని సినతల్లి పాత్రలో అద్భుతంగా నటించి విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది.

Radheshyam Climax : ‘రాధేశ్యామ్’ క్లైమాక్స్ కోసం సంవత్సరం కష్టపడ్డాం

ఈ సినిమాలో భర్త మరణానికి సంబంధించిన సీన్లు, పోలీసులు చిత్రహింసలు పెట్టే సీన్లలో లిజో అసలు గ్లీజరిన్‌ లేకుండా ఏడుపు సన్నివేశాలు చేసినట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ఇటీవలే అక్టోబర్ 5న అరుణ్‌ అంటోనీ అనే వ్యక్తిని వివాహం కూడా చేసుకుంది. ఈ సినిమాతో మరిన్ని అవకాశాలు లీజోకి వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు.

ట్రెండింగ్ వార్తలు