Jai Bhim : నిజాయితీగా తీస్తే నెత్తిన పెట్టుకుంటారు..

వెర్సటైల్ యాక్టర్ సూర్య నటించి, నిర్మించిన ఎమోషనల్ ఎంటర్‌టైనర్ ‘జై భీమ్’.. రేర్ ఫీట్ సాధించింది..

Jai Bhim: తమిళనాడులో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన ‘జై భీమ్’ సినిమా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. నవంబర్ 2 నుండి తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో అమెజాన్ ప్రైమ్‌లో ‘జై భీమ్’ స్ట్రీమింగ్ అవుతోంది.

Jai Bhim Trailer : న్యాయస్థానం మౌనం.. చాలా ప్రమాదకరం..

మీడియా, సోషల్ మీడియాలో ‘జై భీమ్’ సినిమా గురించిన వార్తలే వైరల్ అవుతున్నాయి. వెర్సటైల్ యాక్టర్ సూర్య హీరోగా నటించడంతో పాటు 2 డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ మీద భార్య జ్యోతికతో కలిసి నిర్మించారు. జ్ఞానవేల్ డైరెక్ట్ చేశారు.

Jai Bhim: చలించిపోయిన లారెన్స్.. రియల్ సినతల్లికి ఇల్లు కట్టిస్తానని హామీ!

‘జై భీమ్’ మూవీకి ఆడియన్స్‌ ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారు. రాజకన్ను, పార్వతి అనే దంపతుల కథను ఆధారంగా చేసుకుని.. రాజన్న, సినతల్లి క్యారెక్టర్లను తయారు చేశారు దర్శకుడు. సినతల్లిగా లిజోమోల్ జోస్, రాజన్నగా కె.మణికందన్ వారి పాత్రల్లో జీవించేశారు. సినతల్లి క్యారెక్టర్‌కు మహిళలతో పాటు అందరూ కనెక్ట్ అయ్యారు.

Naatu Naatu Song Promo : రామ్, భీమ్ ఆట – పాట.. తప్పదు రికార్డుల వేట..

సెలబ్రిటీలు సినిమా చూసి సోషల్ మీడి ద్వారా స్పందిస్తున్నారు. రీసెంట్‌గా ‘జై భీమ్’ రేర్ పీట్ సాధించింది. IMDB రేటింగ్స్‌లో 9.6 రేటింగ్‌తో టాప్ ప్లేస్ సొంతం చేసుకుంది. అలాగే IMDB టాప్ 250 మూవీస్ లిస్టులో చేరింది. నిజాయితీగా మనసుకి హత్తుకునే మంచి సినిమా తీస్తే ఆడియన్స్ నెత్తిన పెట్టుకుంటారనే మాటను మరోసారి నిజమని నిరూపించింది ‘జై భీమ్’..

Tamannaah Bhatia : చిరు పక్కన ఛాన్స్ కొట్టేసిందిగా

ట్రెండింగ్ వార్తలు