Ram Charan : రామ్ చరణ్‌కి పుట్టబోయే బిడ్డ కోసం కీరవాణి కొడుకు స్పెషల్ ట్యూన్.. ఉపాసన ట్వీట్!

రామ్ చరణ్, ఉపాసనల బేబీ కోసం ఎం ఎం కీరవాణి తనయుడు కాలభైరవ.. ఒక స్పెషల్ ట్యూన్ చేసి బహుమతిగా పంపించాడు.

Kaala Bhairava special gift for Ram Charan Upasana baby

Ram Charan – Kaala Bhairava : రామ్ చరణ్, ఉపాసన (Upasana) త్వరలో తల్లిదండ్రులు కాబోతున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ గుడ్ న్యూస్ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మెగా కుటుంబం మరియు అభిమానుల్లో ప్రస్తుతం పండుగా వాతావరణం నెలకుంది. ఇక వీరిద్దరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ పలువురు అందమైన బహుమతులు ఉపాసనకు పంపిస్తున్నారు. ఈ క్రమంలోనే అలియా భట్ (Alia Bhatt) బేబీ వెర్ డ్రెస్సెస్ పంపిస్తే, ప్రజ్వల ఫౌండేషన్ (Prajwala Foundation) వాళ్ళు ఒక ప్రత్యేక ఉయ్యాలను పంపించారు.

Ram Charan : ఆగస్టు వరకు నో షూటింగ్స్ అంటున్న చరణ్.. ఏదైనా ఉపాసన డెలివరీ అయ్యాకే..

తాజాగా ఎం ఎం కీరవాణి (M M Keeravani) తనయుడు కాలభైరవ.. ఒక మధురమైన బహుమతిని పంపించాడు. ఒక స్పెషల్ ట్యూన్ చేసి ఉపాసనకు పంపించాడు. ఆ ట్యూన్ పిల్లలు మరియు తల్లిదండ్రుల్లో.. సంతోషం, ఆనందం, పాజిటివ్ ఫీలింగ్ ని క్రియేట్ చేస్తుందని తెలియజేశాడు. ఇక ఈ ట్యూన్ ని ఉపాసన షేర్ చేస్తూ కాలభైరవకు థాంక్స్ చెప్పింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. ఒకసారి మీరు కూడా ఆ ట్యూన్ వినేయండి ఈ కింద ఉంది.

Ram Charan – Upasana : బిడ్డ పుట్టాక పూర్తి బాధ్యత చిరంజీవిదే అంటున్న ఉపాసన.. అత్తమామల దగ్గరకు షిఫ్ట్‌!

కాగా ఉపాసనకు జులైలో డెలివర్ కాబోతున్నట్లు తెలుస్తుంది. ప్రెగ్నెంట్ గా ఉన్న ఉపాసనను చరణ్ కొన్నిరోజులు నుంచి దగ్గర ఉండి చూసుకుంటున్నాడు. గత నెల రోజులు నుంచి షూటింగ్స్ కి సైతం వెళ్లడం లేదు. ఆగష్టు నెల వరకు కూడా రామ్ చరణ్ సినిమా షూటింగ్స్ లో పాల్గొనడని తెలుస్తుంది. పుట్టబోయే బిడ్డతోనే కొన్ని రోజులు గడపాలని చరణ్ భావిస్తున్నాడని సమాచారం. ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ చెంజర్ సినిమాలో నటిస్తున్నాడు. శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా రాబోతుంది.

 

ట్రెండింగ్ వార్తలు