RajaSaab : ప్రభాస్ ‘రాజాసాబ్’ కొత్త పోస్టర్‌తో అప్డేట్ వచ్చేసింది.. ఫస్ట్ గ్లింప్స్ అప్పుడే..
తాజాగా నిర్మాణ సంస్థ ప్రభాస్ రాజాసాబ్ అప్డేట్ ఇచ్చింది.
- Saketh U
- Published On : July 28, 2024 / 11:03 AM IST
Prabhas Rajasaab Movie Update Announced with New Poster
RajaSaab Update : ప్రభాస్ ఇటీవలే కల్కి సినిమాతో భారీ హిట్ కొట్టాడు. 1100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించి చాలా రికార్డులు సృష్టించాడు. కల్కి విజయంపై ప్రభాస్ అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇక కల్కి తర్వాత ప్రభాస్ రాజాసాబ్ సినిమాతో రాబోతున్న సంగతి తెలిసిందే. మారుతీ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో రాజాసాబ్ సినిమా తెరకెక్కుతుంది.
Also Read : Dulquer Salmaan : దుల్కర్ మరో తెలుగు సినిమా.. కల్కి నిర్మాతలతో.. ‘ఆకాశంలో ఒక తార’ అంటూ..
రాజాసాబ్ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేస్తామని గతంలో మారుతి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆగస్టు నుంచి ఈ సినిమా మిగిలిన షూటింగ్ జరగనుంది. గతంలో ఈ సినిమా నుంచి ఒక పోస్టర్ రిలీజ్ చేసారు. ఈ సినిమా నుంచి అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. తాజాగా నిర్మాణ సంస్థ రాజాసాబ్ అప్డేట్ ఇచ్చింది. ఓ కొత్త పోస్టర్ రిలీజ్ చేస్తూ రాజాసాబ్ సినిమా పాన్ ఇండియా గ్లింప్స్ రేపు అంటే జులై 29న సాయంత్రం 5 గంటల 3 నిమిషాలకు రిలీజ్ చేస్తామని ప్రకటించారు.
దీంతో ప్రభాస్ అభిమానులు ఈ రాజాసాబ్ పాన్ ఇండియా గ్లింప్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక రాజాసాబ్ సినిమా హారర్ కామెడీ అని సమాచారం. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారు.
