Raj Tarun : ‘జోవియల్ స్టార్’ రాజ్ తరుణ్.. రాజ్ తరుణ్ కూడా స్టార్ ట్యాగ్ పెట్టుకున్నాడుగా..
తాజాగా రాజ్ తరుణ్ కూడా టైటిల్ ట్యాగ్ పెట్టుకోవడం గమనార్హం.
- Saketh U
- Published On : July 28, 2024 / 11:23 AM IST
Raj Tarun having New Title Tag Jovial Star in Purushothamudu Movie
Raj Tarun : సాధారణంగా మన స్టార్ హీరోలందరికీ పేరు ముందు ఏదో ఒక ట్యాగ్ ఉంటుంది. ఇటీవల మిడిల్ రేంజ్ హీరోలు, చిన్న హీరోలు కూడా ఈ టైటిల్ ట్యాగ్స్ వేసుకుంటున్నారు. ఏదో ఒక స్టార్ పేరుతో అభిమానులు తమ హీరోని పిలుచుకుంటారు. గతంలో స్టార్ హీరోలకు మాత్రమే వేసుకునే ట్యాగ్ ఇప్పుడు ప్రతి హీరోకి పేరు ముందు వేస్తున్నారు. హీరోలు స్వతహాగా ఈ స్టార్ ట్యాగ్స్ పెట్టుకోకపోయినా అభిమానులు లేదా సినిమా పరిశ్రమ వ్యక్తులే హీరోలకు ఈ టైటిల్ ట్యాగ్స్ తగిలిస్తున్నారు.
ఇటీవల శర్వానంద్ కూడా ఛార్మింగ్ స్టార్ అని పెట్టుకున్నాడు. ఇక సుధీర్ బాబు నవ దళపతి అనే ట్యాగ్ పెట్టుకున్నాడు. తాజాగా రాజ్ తరుణ్ కూడా టైటిల్ ట్యాగ్ పెట్టుకోవడం గమనార్హం. రాజ్ తరుణ్ నటించిన పురుషోత్తముడు సినిమా ఇటీవల రిలీజయింది. ఈ సినిమాలో హీరో ఇంట్రడక్షన్ షాట్ లో రాజ్ తరుణ్ పేరుకు ముందు ‘జోవియల్ స్టార్’ అని వేశారు.
Also Read : RajaSaab : ప్రభాస్ ‘రాజాసాబ్’ కొత్త పోస్టర్‌తో అప్డేట్ వచ్చేసింది.. ఫస్ట్ గ్లింప్స్ అప్పుడే..
దీంతో ఈ సినిమా చూసిన వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. రాజ్ తరుణ్ టైటిల్ వేసుకోవడం ఒక ఎత్తైతే జోవియల్ స్టార్ అని పెట్టుకోవడం మరో విశేషం. అయితే ఈ టైటిల్ రాజ్ తరుణ్ పెట్టుకోకపోయినా సినిమా టీమ్ పెట్టినట్టు సమాచారం. ఇప్పుడు రాజ్ తరుణ్ లావణ్య వివాదంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో సినిమా రిలీజవ్వడమే గొప్ప అంటే మళ్ళీ తన పేరు ముందు జోవియల్ స్టార్ అని పెట్టుకోవడంతో చర్చగా మారింది. పలువురు నెటిజన్లు దీనిపై విమర్శలు చేస్తుంటే, ఇంకొంతమంది ఇంతకంటే మంచి ట్యాగ్ దొరకలేదా అని కామెంట్స్ చేస్తున్నారు.
Jovial Star Raj Tarun??#RajTarun
pic.twitter.com/OOKdCBHvMY— Instant Always (@InstantAlways) July 27, 2024
