Yasin Malik at Supreme Court: అనుమతి లేకుండా సుప్రీంకోర్టుకు వచ్చిన యాసిన్ మాలిక్.. భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన కేంద్రం

అప్పటి కేంద్ర హోంమంత్రి ముఫ్తీ మహ్మద్ సయ్యద్ కుమార్తె రూబియా సయ్యద్ అపహరణ కేసులో మాలిక్ నిందితుడు. ఈ కేసులో వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ గతేడాది జమ్మూ కోర్టు ఆదేశాలిచ్చింది. అయితే ఈ ఉత్తర్వులను సుప్రీంకోర్టు నిలిపివేసింది

Yasin Malik at Supreme Courtటెర్రర్ ఫండింగ్ కేసులో తీహార్ జైలులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న జమ్మూకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ కమాండర్ యాసిన్ మాలిక్ శుక్రవారం ‌సుప్రీంకోర్టు ముందు వ్యక్తిగతంగా హాజరుకావడం సంచలనంగా మారిది. తిహార్ జైలులో యావజ్జీవ ఖైదు అనుభవిస్తున్న మాలిక్.. ఎలాంటి అనుమతి లేకుండా సుప్రీంకోర్టులోకి అడుగుపెట్టారు. ఊహించని ఈ సంఘటనకు సుప్రీం ధర్మాసనం అవాక్కైంది. వ్యక్తిగతంగా హాజరుకావాలంటూ మాలిక్‭కు తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని ధర్మాసనం పేర్కొంది.

Telangana Politics: బండి సంజయ్‭ని అధ్యక్షుడిగా తొలగించడాన్ని తట్టుకోలేక పురుగుల మందు తాగిన అనుచరుడు

ఇక, దీనిపై కేంద్రం ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. యాసిన్ మాలిక్ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ కేంద్ర హోం సెక్రటరీకి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా లేఖ రాశారు. జమ్మూ కోర్టు ఆదేశాలపై సీబీఐ వేసిన పిటిషన్‌పై విచారణ కోసం యాసిన్ మాలిక్ అత్యున్నత న్యాయస్థానం ముందు హాజరయ్యారు. ఉగ్రవాది యాసిన్ మాలిక్‌ సుప్రీంకోర్టు ముందు హాజరుకావడం తీవ్రమైన భద్రతా లోపం కిందకు వస్తుందని, ఇందువల్ల ఆయన తప్పించుకోవడం కానీ, బలవంతంగా ఎత్తికెళ్లడం కానీ, ఆయనను హతమార్చే అవకాశాలు ఉంటాయని తుషార్ మెహతా హోం సెక్రటరీకి రాసిన లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు.

Gidugu Rudra Raju : జగన్ నడుపుతున్నది నకిలీ కాంగ్రెస్.. వైసీపీలో బానిసలుగా ఉన్నవారంతా తిరిగి కాంగ్రెస్ లోకి రావాలి : గిడుగు రుద్రరాజు

1989లో అప్పటి కేంద్ర హోంమంత్రి ముఫ్తీ మహ్మద్ సయ్యద్ కుమార్తె రూబియా సయ్యద్ అపహరణ కేసులో మాలిక్ నిందితుడు. ఈ కేసులో వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ గతేడాది జమ్మూ కోర్టు ఆదేశాలిచ్చింది. అయితే ఈ ఉత్తర్వులను సుప్రీంకోర్టు నిలిపివేసింది. దీంతో వ్యక్తిగత హాజరుకు అవకాశమివ్వాలంటూ మే 16న సుప్రీంకోర్టుకు మాలిక్ లేఖ రాశారు. అయితే ఇందుకు న్యాయస్థానం అవసరమైన ఉత్తర్వులను జారీ చేస్తుందని సుప్రీంకోర్టు సహాయ రిజిస్ట్రార్ ఈ నెల 18నే బదులిచ్చారు. దీన్ని తప్పుగా అర్థం చేసుకున్న జైలు అధికారులు.. శుక్రవారం భారీ భద్రత నడుమ మాలిక్‭ను సుప్రీంకోర్టుకు తీసుకువచ్చారు.

Rajasthan minister : మహిళల భద్రతపై సొంత ప్రభుత్వంపైనే విమర్శలు…రాజస్థాన్ మంత్రిపై సీఎం వేటు

తీవ్రవాది, వేర్పాటువాది మాత్రమే కాకుండా ఉగ్రవాదులకు నిధులు సమకూర్చారనే ఆరోపణపై యాసిన్ మాలిక్ దోషిగా జైలుశిక్ష అనుభవిస్తున్నాడని సోలిసిటర్ జనరల్ గుర్తు చేశారు. పాక్ ఉగ్రవాద సంస్థలతో కూడా ఆయనకు సంబంధం ఉన్నందున అతను తప్పించుకోవడం, లేదా బలవంతంగా ఎవరైనా ఆయనను తప్పించడం, హతమార్చడం చేయవచ్చని అన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరిగానా సుప్రీంకోర్టు భద్రతకు కూడా ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యక్తిగత హాజరును కోరుకున్నందున మాలిక్‌ను జైలు అధికారులు కోర్టుకు తీసుకువస్తున్నారని తెలిసి తాము దిగ్భ్రాంతికి గురయ్యారని, హోం సెక్రటరీ దృష్టికి తాను ఈ అంశం తీసుసువచ్చే లోపే మాలిక్ సుప్రీంకోర్టుకు చేరుకున్నారని ఆయన వివరించారు. ఈ అంశం తీవ్రతను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని హోం సెక్రటరీని తుషార్ మెహతా కోరారు.

ట్రెండింగ్ వార్తలు