Vedaant : మరోసారి వార్తల్లో మాధవన్ తనయుడు.. మలేషియన్ ఛాంపియన్‌షిప్ లో ఏకంగా 5 గోల్డ్ మెడల్స్

వేదాంత్ చిన్నప్పటి నుంచి స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొంటూ పతకాలు గెలుస్తున్నాడు. గతేడాది కొన్ని జాతీయ, అంతర్జాతీయ పతకాలు గెలవడంతో ఒక్కసారిగా స్టార్ అయ్యాడు వేదాంత్.

Vedaant :  తమిళ్, తెలుగు, హిందీ సినిమాలతో ఎంతగానో ప్రేక్షకులని మెప్పించిన నటుడు మాధవన్(Madhavan). మాధవన్ తో పాటు మాధవన్ తనయుడు కూడా ఇటీవల సెలబ్రిటీ అయ్యాడు. చాలా మంది సినీ పరిశ్రమలోని స్టార్ల పిల్లలు సినీ పరిశ్రమలోకి వస్తారు. కొంతమంది మాత్రమే వేరే రంగాలని ఎంచుకుంటారు. మాధవన్ తనయుడు వేదాంత్(Vedaant) స్పోర్ట్స్ లో స్విమ్మింగ్(Swimming) రంగాన్ని ఎంచుకున్నాడు.

వేదాంత్ చిన్నప్పటి నుంచి స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొంటూ పతకాలు గెలుస్తున్నాడు. గతేడాది కొన్ని జాతీయ, అంతర్జాతీయ పతకాలు గెలవడంతో ఒక్కసారిగా స్టార్ అయ్యాడు వేదాంత్. చిన్న వయసులోనే వేదాంత్ స్విమ్మింగ్ లో పతకాలు సాధిస్తుండటంతో అంతా వేదాంత్ ని అభినందిస్తున్నారు. మాధవన్ కూడా తన తనయుడు మరింత వృద్ధిలోకి రావాలని, స్విమ్మింగ్ లో ఇంటర్నేషనల్ పతకాలు, ఒలింపిక్స్ సాధించాలని దుబాయ్ కి షిఫ్ట్ అయి మరీ అక్కడ తన తనయుడికి స్పెషల్ ట్రైనింగ్ ఇప్పిస్తున్నాడు.

Muttiah Muralitharan : ఎట్టకేలకు ముత్తయ్య మురళీధరన్ బయోపిక్.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్…

తాజాగా మరోసారి వేదాంత్ పేరు వార్తల్లో నిలిచింది. తాజాగా వేదాంత్ మలేషియన్ ఇన్విటేషనల్ ఏజ్ గ్రూప్ ఛాంపియన్ షిప్ 2023లో పాల్గొన్నాడు. ఈ ఛాంపియన్ షిప్ కౌలాలంపూర్ లో జరిగింది. ఈ స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొన్న వేదాంత్ ఏకంగా ఇండియాకు 5 గోల్డ్ మెడల్స్ సాధించాడు. 50,100, 200, 400, 1500 మీటర్ల స్విమ్మింగ్ లో వేదాంత్ గోల్డ్ పతకాలు సాధించాడు. వేదాంత్ తో పాటు మరికొంతమంది ఇండియన్ స్విమ్మర్లు కూడా ఈ ఛాంపియన్ షిప్ లో పతకాలు సాధించారు. ఒకే ఛాంపియన్ షిప్ లో ఏకంగా 5 బంగారు పతకాలు సాధించడంతో పలువురు వేదాంత్ ని అభినందిస్తున్నారు. భవిష్యత్తులో కచ్చితంగా వేదాంత్ ఒలంపిక్స్ కి వెళ్తాడని అంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు