SSMB28 : సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), త్రివిక్రమ్ కలయికలో వస్తున్న చిత్రం SSMB28. గతంలో వీరిద్దరి కాంబినేషన్ ఆడియన్స్ ని ఆకట్టుకోవడంతో ఈ మూవీ పై భారీ అంచనాలే నెలకొన్నాయి. దీంతో ఈ సినిమా పై రోజుకో రూమర్ బయటకి వస్తుంది. తాజాగా ఈ చిత్రం గురించి ఒక రూమర్ వైరల్ అవ్వడంతో మహేష్ అభిమానులు ఆందళోన చెందారు. అయితే నిర్మాత నాగవంశీ వీటి పై స్పందిస్తూ రూమర్లు రాసే వారికీ గట్టి కౌంటర్ ఇచ్చాడు. అలాగే మూవీకి సంబంధించిన క్రేజ్ అప్డేట్ ఇచ్చి అభిమానులను ఖుషీ చేశాడు.
Mahesh Babu : మహేష్ బాబు సినిమా రిలీజ్ కోసం సుకుమార్ భార్య వెయిటింగ్.. ఏ మూవీ తెలుసా?
ఈ మూవీ ఈ ఏడాది ఆగష్టు రిలీజ్ కావాల్సి ఉంది. కానీ షూటింగ్ లేట్ అవ్వడంతో విడుదల తేదీ వచ్చే సంవత్సరం జనవరికి వెళ్ళింది. ఇది ఇలా ఉంటే.. ఈ మూవీ కొత్త షెడ్యూల్ పై త్రివిక్రమ్ క్లారిటీ ఇవ్వడం లేదని, మహేష్ నిర్మాతలను ఇంటికి పిలిచి ప్రశ్నించాడని, వారం రోజుల్లో నిర్మాతలు క్లారిటీ ఇష్టము అనడంతో మహేష్ సమ్మర్ వెకేషన్ కి చెక్కేస్తున్నాడు అంటూ పలు వెబ్ సైట్ లు కథనాలు రాసుకొచ్చాయి.
ఇక వార్తలకు కౌంటర్ ఇస్తూ నాగవంశీ.. “పక్షులు ఆహారం కోసం వెతుకుతున్నప్పుడు బిగ్గరగా అరుస్తాయి. అదే విధంగా, ఎవరికైనా ఫేమ్ అవసరమైనప్పుడు పుకార్లు వ్యాపిస్తాయి. వాటిని పట్టించుకోక పోవడం లేదా వారిని చూసి నవ్వడం చెయ్యండి. ఈ గాసిప్ రాయుళ్లు వాళ్ళ పుకార్లుతో సినిమాలు చేస్తే ఇండస్ట్రీకి లాభం చేకూరుతుంది. SSMB28 ఖచ్చితంగా బ్లాక్‌బస్టర్‌గా ఉండాలని మేము కోరుకుంటున్నాము. అందుకోసం జాగ్రత్తగా పని చేయనివ్వడం మంచిది. ఇటీవల రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ మీకు ఎంతగానో నచ్చింది. మే 31న మీ కోసం ఒక సర్ప్రైజ్ రెడీ చేస్తున్నాము. దాని కోసం ఎదురు చూస్తూ ఉండండి” అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
If these gossip mongers can take a hike or make movies like they spread rumours, Industry can benefit. We want #SSMB28 to be a sure-shot Blockbuster and YOU TAKE OUR WORD ON IT.
It would be better to let us work at our pace in peace ✌️ Remember it is Jan 2024 release film!…
— Naga Vamsi (@vamsi84) April 27, 2023