Koppula Eshwar : సీసీ కెమెరా ఒరిజినల్ ఫుటేజ్ నీ దగ్గరే ఉంది.. బయటపెట్టు : మంత్రి కొప్పుల

లక్ష్మణ్ కుమార్ అనుమానించిన పది బూతుల్లో ఎలాంటి ఓట్ల తేడాలు లేవన్నారు. ధర్మపురి ఎన్నిక ఫలితాలకు సంబంధించిన ఎక్కడైనా సరే చర్చించుకుందామని తెలిపారు.

Koppula Eshwar

Koppula Eshwar- Adluri Laxman Kumar : 30 ఏళ్ల ప్రజా జీవితంలో మచ్చలేని జీవితాన్ని గడిపానని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ఎన్నికల రీకౌంటింగ్ గురించి తనపై అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తప్పుడు ఆరోపణలు చేయడం బాధాకరమని అన్నారు. కోర్టు తీర్పు అనంతరం అడ్లూరి లక్ష్మణ్ పై న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ మేరకు ఈశ్వర్.. జగిత్యాల జిల్లాలో మీడియాతో మాట్లాడారు.

ఎన్నికల ప్రక్రియ రాష్ట్రా, కేంద్ర ఎన్నికల కమిషన్ పరిధిలో జరుగుతుందని తెలిపారు. ఎలక్షన్ కమిషన్ పూర్తి స్వయం ప్రతిపత్తి గల సంస్థ అని పేర్కొన్నారు. ధర్మపురి ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్ తనపై ఎన్నో ఆరోపణలు చేశారని వెల్లడించారు. ధర్మపురి కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్.. ఐఏ పిటిషన్ లు వేసి తీర్పు రాకుండా కేసును నీరుగార్చుతున్నారని మండిపడ్డారు.

కేసీఆర్ పాలనకు చరమగీతం పాడేందుకే భట్టి పాదయాత్ర : పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

నిబంధనల ప్రకారం ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఈవీఎంలను ధర్మపురి కాలేజ్ లో భద్రపరిచారని పేర్కొన్నారు. లక్ష్మణ్ కుమార్ అనుమానించిన పది ఎన్నికల పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి ఓట్ల తేడాలు లేవన్నారు. ధర్మపురి ఎన్నిక ఫలితాలకు సంబంధించి ఎక్కడైనా సరే చర్చించుకుందామని తెలిపారు.

“ఎన్నికకు సంబంధించిన సీసీ కెమెరా ఒరిజినల్ ఫుటేజ్ నీ దగ్గరే ఉంది లక్ష్మణ్.. దానిని కోర్టులో సమర్పించి చిత్తశుద్ధి చాటుకో” అని అన్నారు. స్ట్రాంగ్ రూమ్ తాళాలు తన చేతిలో ఉన్నాయనడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజాస్వామ్యం, న్యాయ వ్యవస్థపై లక్ష్మణ్ కు ఏ మాత్రం గౌరవం ఉన్నా తీర్పు త్వరగా వచ్చేలా వ్యవహరించాలని సూచించారు.

ట్రెండింగ్ వార్తలు