MLA Muthireddy : ప్రజల ముందే ఎమ్మెల్యే ముత్తిరెడ్డిని నిలదీసిన కూతురు .. వదిలేదిలేదంటూ వార్నింగ్

కన్నతండ్రిని నలుగురిలోను నిలదీసింది జనగామ ఎమ్మెల్యే మత్తురెడ్డి కుమార్తె భవానీ. తన భూమి తనకు తిరిగి అప్పగించకపోతే మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటూ తండ్రికే వార్నింగ్ ఇచ్చింది.

MLA Muthireddy Vs Daughter Tulja Bhawani

 

MLA Muthireddy Vs Daughter Bhawani : జనగామ ఎమ్మెల్యే ముత్తురెడ్డి, అతని కుమార్తెకు మధ్య భూ వివాదానికి సంబంధించిన విభేధాలు కొనసాగుతున్నాయి. తండ్రిపై గతంలో భవానీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.సిద్ధిపేట జిల్లా చేర్యాలలో తన సంతకాన్ని ఫోర్జరీ చేసి ఎకరం 20 గుంటలు ముత్తిరెడ్డి పేరు మీద మార్చుకున్నారని ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు తుల్జా భవానీ రెడ్డి. కానీ తన కూతురిని కొంతమంది తప్పుదారి పట్టించి ఇలా తనపై కక్ష సాధిస్తున్నారంటూ ముత్తురెడ్డి కంటతడి పెట్టిన విషయం తెలిసిందే. ఇది మా కుటుంబ విషయం నా కూతురు నేను కూర్చుని మాట్లాడుకుంటాం సెటిల్ చేసుకుంటామంటూ చెప్పుకొచ్చారు. కానీ తండ్రీ కూతుళ్ల మధ్య భూవివాదం కొనసాగుతునే ఉంది.

konda Murali : వరంగల్‌లో కంపెనీలు పెడతానని భూములు తీసుకున్నారు, ఏడేళ్లు అయినా అతీగతీ లేదు : కొండా మురళీ

ఈక్రమంలో కన్నతండ్రిని నలుగురిలోను నిలదీసింది జనగామ ఎమ్మెల్యే మత్తురెడ్డి కుమార్తె భవానీ. తనను భయపెట్టిన తన భూమిని బలవంతంగా తన తండ్రి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపిస్తు ప్రజల ముందే నిలదీసింది. హరిత దినోత్సవం కార్యక్రమం సందర్భంగా తండ్రీకూతురు ఎదురురయ్యారు. దీంతో భవానీ తన భూమి తనకు తిరిగి అప్పగించకపోతే మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటూ తండ్రికే వార్నింగ్ ఇచ్చింది.

కాగా ముత్తురెడ్డిపై ఇదివరకే భూకబ్జా ఆరోపణలు ఉన్నాయి. చెరువు భూమిని ఎమ్మెల్యే కబ్జా చేశారంటూ గతంలో ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇప్పుడు కూతురి ఫిర్యాదు..జనాల్లోనే బహిరంగంగా నిలదీయటంతో తన భూమి తనకు తిరిగి అప్పగించకపోతే మళ్లీ పోలీసు ఫిర్యాదు చేస్తానని వార్నింగ్ ఇవ్వటం ఆసక్తికరంగా మారింది. భూమి విషయంలో ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డితో కూతురు తుల్జాభవానీ వాగ్వాదానికి దిగారు. చేర్యాల భూవివాదంలో తన సంతకంపై ఎమ్మెల్యే అయిన తన తండ్రిని బహిరంగంగా నిలదీయటంతో ప్రజల్లో ముత్తురెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ప్రజాప్రతినిధులు, అధికారుల ముందే భూములకు సంబంధించి కూతురు ప్రశ్నించటం నిలదీయటంతో ముత్తురెడ్డికి పాలుపోలేదు.

MP Soyam Bapurao : నా సొంత అవసరాల కోసం ఎంపీ లాడ్స్ నిధులు వాడుకున్నా.. తప్పేంటీ..? : ఎంపీ సోయం బాపూరావు

కన్నకూతురే తనను నలుగురిలోను ఆస్తి గురించి నిలదీయటంతో ముత్తిరెడ్డి ఇరకాటంలో పాడ్డారు. అక్కడే ఉన్న మీడియా ప్రశ్నించటంతో తన కుమార్తెను రాజకీయ ప్రత్యర్థులు తప్పుదోవ పట్టిస్తున్నారని..తమ కుటుంబ సమస్యను ప్రత్యర్థులు పావుగా వాడుకున్నారని అని ఆరోపిస్తు ఆవేదన వ్యక్తంచేశారు.తన కుటుంబ సమస్యను ఇలా రచ్చకీడ్చి రాజకీయం చేయడం సరికాదన్నారు. వచ్చే ఎన్నికల్లో తనకు సీటు రాకూడదని ఇచ్చినా గెలవకూడనే కుట్రంతో ఇలా చేస్తున్నారని ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా..ఎన్ని కుట్రలు చేసినా మళ్లీ తానే గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.

 

 

ట్రెండింగ్ వార్తలు