Jr NTR Watch: ఆర్ఆర్ఆర్ ట్రైలర్ విడుదల అనంతరం దర్శకుడు రాజమౌళి, హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ సహా టీం అంతా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో రాజమౌళి-తారక్-చరణ్ మధ్య బాండింగ్ ఎలా ఉంటుందో హైలెట్ అవగా.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతికి ఉన్న ఖరీదైన వాచ్ అందరి దృష్టి ఆకర్షించింది. సహజంగానే కార్లు, బైకులే కాదు తారక్ వాచ్ కలెక్షన్ విషయంలో కూడా ఏ మాత్రం తగ్గడని పేరు. అందుకే తారక్ ధరించిన ఈ వాచ్ పై అందరి దృష్టి పడింది. ఈ ఫోటోలు వైరల్ కావడంతో నెటిజన్లు కూడా ఈ వాచ్ గురించి వెతకడం మొదలు పెట్టారు.
Sara Ali Khan: రౌడీ హీరోపై మనసు పారేసుకున్న సైఫ్ కూతురు సారా!
సాధారణంగా సెలబ్రెటీలు ఖరీదైన వస్తువులు వాడటం కామన్. అయితే.. తారక్ వాచ్ చూసి మాత్రం అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ వాచ్ కాస్ట్ చూసిన వారికి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించాల్సిందే. ఎందుకంటే ఆ వాచ్ రేటు అక్షరాలా నాలుగు కోట్లు. నాలుగు కోట్ల వాచ్ ఏంటీ బ్రో అని అనిపింస్తుంది కదా.. అవును రిచర్డ్ మిల్లే ఆర్ఎం 011 కార్బోన్ ఎన్టీపీటీ గ్రోస్జీన్ రోజ్ గోల్డ్ లోటస్ F1 టీం లిమిటెడ్ ఎడిషన్ వాచ్ ఖరీదు ఆన్ లైన్ లో 3కోట్ల 99 లక్షల 32 వేల 392 రూపాయాలు.
RRR OTT: క్రేజీ అప్డేట్.. ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న స్ట్రీమింగ్ సంస్థ!
నిజానికి ఈ తరహా వాచ్ ఒకటి తారక్ దగ్గర ఇంతకు ముందే ఉండేది. అప్పుడు కూడా ఇలాగే తారక్ వాచ్ ఖరీదు ఇంతా అని అంతా షాక్ అయ్యారు. ఇప్పుడు ఇది అదే కంపెనీ లిమిటెడ్ ఎడిషన్. అందుకే దాదాపు నాలుగు కోట్లు. ఇవి రెండే కాదు సోదరుడు కల్యాణ్ రామ్ కూడా గతంలో తారక్‌కు కోటి రూపాయల వాచ్ ఒకటి గిఫ్ట్ ఇచ్చాడు. మరి ఇవి కాకుండా ఇంకెన్ని ఉన్నాయో. వాచ్ లే కాదు.. లగ్జరీ కార్లు, బైకులు కూడా ఎన్నో. అత్యంత కాస్ట్ లీ కార్ లంబోర్గిని ఉరుస్ మోడల్ తారక్ సొంతం కాగా లావిష్ వోల్వో కారవాన్ కూడా సిద్ధం చేయించుకున్నాడు తారక్.