Nagarjuna : టాలెంట్ ఉందా.. అయితే నాగార్జునకి వాట్సాప్ చేయండి..

సినిమాల్లోకి రావాలి అనుకుంటున్న వారికీ తానూ అవకాశం కల్పిస్తాను అంటున్నాడు నాగార్జున (Akkineni Nagarjuna). ఇందుకోసం మీరు చేయవల్సిన పని ఏంటంటే.. మీ దగ్గర ఉన్న ఆలోచలను 70**** వాట్సాప్ చేసి అప్లై చేయడమే.

Nagarjuna : టాలెంట్ ఉన్న ఇండస్ట్రీలో అడుగు పెట్టడానికి దారి దొరక్క ఎంతోమంది ఇబ్బందులు పడుతుంటారు. అటువంటి వారికీ తాను ఒక ప్లాట్‌ఫార్మ్ అవుతాను అంటున్నాడు నాగార్జున (Akkineni Nagarjuna). అయితే మీకు ఈ కథ కంటే ముందు మీకు మరో కథ తెలియాలి. 1944 లో అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswara Rao) గుడివాడ రైల్వే స్టేషన్ లో రైలు కోసం ఎదురు చూస్తున్న సమయంలో తన ఎదురుగా వచ్చి ఆగిన ఒక ట్రైన్ అప్పటి దర్శకనిర్మాత గంటశాల బలరామయ్య, ANR ని చూసి.. బాగున్నాడని పిలిచి మరి హీరో అవకాశం ఇచ్చారు.

Samantha : నాగచైతన్యపై సమంత నిజంగానే ఆ వ్యాఖ్యలు చేసిందా.. క్లారిటీ ఇచ్చిన సమంత

అక్కడ మొదలైన అక్కినేని ప్రయాణం నేడు ఆయన వారసులు కూడా కొనసాగిస్తున్నారు. అయితే తన తండ్రికి వచ్చినట్లు అందరికి అవకాశం ఎదురు రాదని భావించిన నాగార్జున.. ఆ అవకాశాన్ని ఇప్పుడు ఇండస్ట్రీకి వద్దామనుకుంటున్న వారికి కలిపిస్తాను అంటూ ముందుకు వస్తున్నాడు. ‘THE NEXT BIG THING’ అనే కార్యక్రమంతో టాలెంట్ ఉన్న వాళ్ళని తానే ఇండస్ట్రీకి పరిచయం చేస్తాను అంటున్నాడు. ఇందుకోసం మీరు చేయవల్సిన పని ఏంటంటే.. మీ దగ్గర ఉన్న ఆలోచలను 7093500514 వాట్సాప్ చేసి అప్లై చేయడమే.

Ram Charan : సల్మాన్ అండ్ వెంకీ మామతో చరణ్ మాస్ స్టెప్పులు అదరగొట్టేశాడుగా..

మీ ఐడియా నచ్చితే సినిమా అవకాశం మీ దగ్గరికే వస్తుంది. మరి సినిమాల్లోకి రావాలి అనుకుంటున్న వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. అన్నపూర్ణ కాలేజీ అఫ్ ఫిలిం అండ్ మీడియా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఇది ఇలా ఉంటే, నాగార్జున చివరిగా ది ఘోస్ట్ (The Ghost) అనే సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఈ సినిమా రిలీజ్ అయ్యి నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు మరో సినిమా ప్రకటిచలేదు నాగార్జున.

ట్రెండింగ్ వార్తలు