Naga Shaurya : టాలీవుడ్ యువ హీరో నాగశౌర్య ఇంట పెళ్లి సందడి నెలకొంది. హీరో నాగశౌర్య సోదరుడు గౌతమ్ వివాహం ఘనంగా జరిగింది. జూన్ 23న గౌతమ్ నమ్రత గౌడను వివాహం చేసుకున్నారు. అయితే ఈ పెళ్లి అమెరికాలో జరిగింది. గౌతమ్ అక్కడే సెటిల్ అవ్వడం, పెళ్లి కూతురు ఫ్యామిలీ కూడా అక్కడే సెటిల్ అవ్వడంతో వీరి పెళ్లి అమెరికాలో హిందూ సాంప్రదాయ పద్దతిలో జరిగింది.
Ranbir Kapoor : ఆలియా నా మొదటి భార్య కాదు.. రణబీర్ వ్యాఖ్యలు..
ఈ వివాహ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. అయితే సోదరుడు గౌతమ్ వివాహానికి నాగశౌర్య మాత్రం గైర్హాజరయ్యాడు. నాగశౌర్య ప్రస్తుతం ఒక సినిమా షూటింగ్లో బిజీగా ఉండటంతో పెళ్లికి హాజరు కాలేదని తెలుస్తుంది. అయితే పెళ్లి జరిగే సమయంలో నాగశౌర్య తల్లిదండ్రులు వీడియో కాల్ ద్వారా గౌతమ్ పెళ్లిని చూపించారు. గౌతమ్ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.