Nandeshwar Goud: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే ఆ ఇళ్లపైకి బుల్డోజర్లను పంపుతాం: మాజీ ఎమ్మెల్యే

బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే కుంట భూమిని కబ్జా చేసి ఫంక్షన్ హాలు కట్టారని నందీశ్వర్ గౌడ్ చెప్పారు.

Nandeshwar Goud

Nandeshwar Goud – Patancheru: తెలంగాణ ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే, బీజేపీ (BJP) నేత నందీశ్వర్ గౌడ్ తీవ్ర విమర్శలు చేశారు. 17 వేల డబుల్ బెడ్రూం ఇళ్లు ప్రారంభించారని, కానీ ఎవరికీ ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి (Mahipal Reddy) కాదని పాపాల రెడ్డి అని విమర్శించారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే కుంట భూమిని కబ్జా చేసి ఫంక్షన్ హాలు కట్టారని నందీశ్వర్ గౌడ్ చెప్పారు. శ్మశానాలను కూడా కబ్జా చేశారని ఆరోపించారు. అందులో ప్రభుత్వ పెద్దల వాటా ఉందని తెలిపారు. తాను చేసిన ఆరోపణల్లో నిజం లేకపోతే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని నందీశ్వర్ గౌడ్ అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తుందని, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కబ్జా చేసి కట్టిన ఇళ్లపైకి బుల్డోజర్ ను పంపుతామని చెప్పారు.

అటువంటి నేతను వచ్చే ఎన్నికల్లోనూ గెలిపించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అంటున్నారని నందీశ్వర్ గౌడ్ చెప్పారు. మహిపాల్ రెడ్డికి మళ్లీ ఓటేయాలని చెప్పడానికి సీఎంకు సిగ్గుండాలని విమర్శించారు. తెలంగాణలో బీజేపీ గెలిచే మొదటి స్థానం పటాన్ చెరునేనని తెలిపారు.

ఇస్నాపూర్ వరకు మెట్రోను విస్తరిస్తామని అంటున్నారని, మరి తొమ్మిది సంవత్సరాలుగా ఎందుకు ఆ పనిచేయలేదని నిలదీశారు. ప్రజలను మోసం చేయడం తప్ప కేసీఆర్ ఏమీ చేయలేదని నందీశ్వర్ గౌడ్ విమర్శించారు. పటాన్ చెరులో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లు 70 శాతం స్థానికులకే ఇవ్వాలని, లేకపోతే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. పటాన్ చెరులో భూ కబ్జాలు జరుగుతున్నాయని ఆరోపించారు.

Minister KTR : తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరించాలి : మంత్రి కేటీఆర్

ట్రెండింగ్ వార్తలు