Nani: ‘దసరా’ ముగింపుకు ఫిక్స్ అయిన నాని.. ఇక ఆగేదే లేదట!

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘దసరా’ షూటింగ్‌కు గతకొద్ది రోజులుగా బ్రేక్ పడింది. ఈ సమయంలో నాని అయ్యప్ప దీక్ష తీసుకోవడం.. నిర్మాతగా మారి హిట్-2 సినిమాను ప్రమోట్ చేస్తూ బిజీగా ఉన్నాడు. అయితే ఇప్పుడు నాని తన మూవీ ‘దసరా’పైనే పూర్తి ఫోకస్ పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.

Nani: నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘దసరా’ షూటింగ్‌కు గతకొద్ది రోజులుగా బ్రేక్ పడింది. ఈ సమయంలో నాని అయ్యప్ప దీక్ష తీసుకోవడం.. నిర్మాతగా మారి హిట్-2 సినిమాను ప్రమోట్ చేస్తూ బిజీగా ఉన్నాడు. అయితే ఇప్పుడు నాని తన మూవీ ‘దసరా’పైనే పూర్తి ఫోకస్ పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.

Nani : ‘హిట్’ వర్స్ లో సినిమాలు వస్తూనే ఉంటాయి.. హిట్ 7లో ఏడుగురు హీరోలు ఉంటారు..

త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ను తిరిగి ప్రారంభించి ఎలాంటి గ్యాప్ లేకుండా సినిమా షూటింగ్‌ను ముగించేయాలని నాని ప్లాన్ చేస్తున్నాడట. ఇక ఈ సినిమాలో నాని పూర్తి తెలంగాణ యాసలో దుమ్ములేపేందుకు రెడీ అవుతుండగా.. సింగరేణి గనుల నేపథ్యంలో సాగుతున్న ఈ సినిమాలో నాని రస్టిక్ అండ్ రఫ్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్, సాంగ్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి.

Nani Dasara Movie : సమ్మర్ కి రెడీ అంటున్న దసరా.. ‘ఎట్లైతే గట్లే సూస్కుందామ్‌’.. సిల్క్‌స్మిత ఫోటో ముందు మందు సీసాతో నాని..

ఇక ఈ సినిమా షూటింగ్‌ను డిసెంబర్ 16 నుంచి తిరిగి స్టార్ట్ చేసి, ఈ నెలాఖరు వరకు పూర్తి చేయాలని నాని ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాను మార్చి 30న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించడంతో ఈ సినిమా విషయంలో నాని దూకుడును చూపించాలనుకుంటున్నాడు. ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. సంతోష్ నారాయణ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు.

ట్రెండింగ్ వార్తలు