Baahubali Crown Of Blood Trailer : ‘బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్’ యానిమేటెడ్ సిరీస్ ట్రైలర్ వచ్చేసింది.. మాహిష్మతి మీదకి కట్టప్పతో దండెత్తి వచ్చిన రక్తదూత్..
దర్శకదీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ బాహుబలి.
- Thota Vamshi Kumar
- Published On : May 2, 2024 / 03:34 PM IST
Baahubali Crown Of Blood Animated Series Trailer out
దర్శకదీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ బాహుబలి. ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ, తమన్నాలు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా రెండు భాగాలుగా విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక ఈ సినిమా మూడో భాగం (బాహుబలి-3) త్వరలోనే తెరకెక్కనుందనే వార్తలు వినిపించాయి. వాటి సంగతి ఏమో కానీ.. దర్శకుడు రాజమౌళి ‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’ అనే పేరుతో ఓ యానిమేటెడ్ సిరీస్ ఇటీవల చెప్పిన సంగతి తెలిసిందే.
తాజాగా ఈ సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు. అంతేకాదండోయ్ ఏ ఓటీటీలో రాబోతుంది ఎన్నడు స్ట్రీమింగ్ కానుంది అనే వివరాలను వెల్లడించారు. మే 17 నుంచి డిస్నీ+ హాట్‌స్టార్‌లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్‌లో బాహుబలి సినిమాలో చూపింపిన స్టోరీకి ముందు చాలా విషయాలు జరిగాయని వాటిని చూపించబోతున్నారని ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది.
రక్తదూత్ అనే రాజు ఆయుష్మతి సింహాసనానికి కట్టు బానిస అని చెప్పుకునే కట్టప్ప నే తన సేనాధిపతిగా నియమించుకొని మాహిష్మతి రాజ్యం మీదకు దండెత్తివస్తాడు. ఇక సింహాసనం కోసం బాహుబలిని ఎలా తప్పించాలా అని ఎదురుచూసే భల్లాలదేవ.. తన సోదరుడు బాహుబలితో కలిసి రక్తదూత్ ను ఎదిరిస్తాడా? లేదా? అనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ యానిమేటెడ్ సిరీస్ తెరకెక్కినట్లుగా అనిపిస్తోంది. దండెత్తడానికి వచ్చిన కట్టప్ప మాహిష్మతికి కట్టుబానిసగా ఎలా మారాడు వంటి విషయాలు తెలుసుకోవాలంటే సిరీస్ చూడాల్సిందే.
Mahishmati ke khoon se likhi ek nayi kahani ?
Hotstar Specials S.S. Rajamouli’s Baahubali : Crown of Blood streaming from 17th May.#BaahubaliOnHotstar pic.twitter.com/43mwjsGfZS
— Disney+ Hotstar (@DisneyPlusHS) May 2, 2024
