Trisha Vijay TVK: విజిల్ సౌండ్ తో విజయ్ కి ఫుల్ సపోర్ట్.. లక్షల్లో షేర్ అవుతున్న త్రిష పోస్ట్
Trisha Krishnan TVK: విజయ్ కి సపోర్ట్ గా స్టార్ బ్యూటీ త్రిష(Trisha) పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.
A post shared by Trisha in connection with the Tamil Nadu elections is going viral.
- తమిళనాట ఎలక్షన్స్ సందడి
- పోలింగ్ వేల త్రిష పోస్ట్ సెన్సేషనల్ పోస్ట్
- విజిల్ సౌండ్ తో విజయ్ కి ఓపెన్ సపోర్ట్
Trisha TVK: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా సినిమా స్టార్స్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే, స్టార్ హీరోయిన్ త్రిష ఓటు వేసిన అనంతరం సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు కోలీవుడ్ రాజకీయాల్లోనూ, సినీ వర్గాల్లోనూ సంచలనంగా మారింది. ఆమె తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ‘గిల్లి’ సినిమాలోని ‘అర్జునార్ విల్లు’ పాటను బ్యాక్‌గ్రౌండ్‌గా జోడించి షేర్ చేసిన వీడియో క్షణాల్లో వైరల్ అయింది. కేవలం కొద్దిసేపటికే లక్షలాది లైకులు సంపాదించిన ఈ పోస్ట్, ఆమె రాజకీయ ప్రాధాన్యతలపై పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.
*నాకు మా తమ్ముడు చెప్పాడు.. నేను అసలు నమ్మలేదు.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన మమిత
ముఖ్యంగా ఆ పాటలో వచ్చే ‘విజిల్’ శబ్దాన్ని హైలైట్ చేస్తూ త్రిష(Trisha) పోస్ట్ పెట్టడం వెనుక బలమైన కారణం ఉందని నెటిజన్లు విశ్లేషిస్తున్నారు. ఈ ఎన్నికల్లో టీవీకే (TVK) పార్టీ తరపున బరిలో ఉన్న స్టార్ హీరో విజయ్ గుర్తు కూడా ‘విజిల్’ కావడం గమనార్హం. దీంతో త్రిష పరోక్షంగా విజయ్‌కు తన మద్దతును ప్రకటించిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య వ్యక్తిగత సాన్నిహిత్యం ఉందంటూ వస్తున్న రూమర్లకు, తాజా పోస్ట్ మరింత ఆజ్యం పోసినట్లయింది.
View this post on Instagram
