NBK 111: బాలయ్య మూవీ నుంచి నయనతార అవుట్.. చందమామకి దక్కిన ఛాన్స్
నందమూరి బాలకృష్ణ సినిమాలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ (NBK 111)నటియించనుంది.
Kajal aggarwal is the heroine in nbk 111 instead of Nayanthara.
- బాలకృష్ణ మూవీ నుంచి తప్పుకున్న నయనతార
- కాజల్ ను హీరోయిన్ గా తీసుకున్న మేకర్స్
- మరో హీరోయిన్ కూడా ఉండే అవకాశం
NBK 111: నందమూరి బాలకృష్ణ హీరోగా, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడంతో, ఈ క్రేజీ ప్రాజెక్టుపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై శరవేగంగా జరుగుతోంది. గోపీచంద్ మలినేని తన మార్క్ మాస్ ఎలిమెంట్స్‌తో బాలయ్య(NBK 111)ను మరోసారి పవర్ఫుల్ పాత్రలో చూపించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాను వెంకట సతీశ్ కిలారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
Trisha: విజిల్ సౌండ్ తో విజయ్ కి ఫుల్ సపోర్ట్.. లక్షల్లో షేర్ అవుతున్న త్రిష పోస్ట్
ఈ సినిమాలో కథానాయికల ఎంపికపై గత కొద్దిరోజులుగా రకరకాల పేర్లు వినిపించాయి. మొదట నయనతారను సంప్రదించినట్లు వార్తలు వచ్చినప్పటికీ, చివరికి చందమామ కాజల్ అగర్వాల్ ఖరారయ్యారు. బాలకృష్ణ సరసన కాజల్ నటిస్తుండటం విశేషం. ఇప్పటికే ‘భగవంత్ కేసరి’లో బాలయ్యతో కలిసి నటించిన కాజల్, మరోసారి ఆయనతో జతకట్టడం ఈ ప్రాజెక్టుపై మరింత ఆసక్తిని పెంచుతోంది. సీనియర్ హీరోల సరసన కాజల్ అగర్వాల్ లక్కీ చార్మ్‌గా మారుతుండటంతో మేకర్స్ ఆమె వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.
అయితే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లకు స్కోప్ ఉండటంతో, రెండో కథానాయిక కోసం అన్వేషణ కొనసాగుతోంది. కీలకమైన ఈ రెండో పాత్ర కోసం టాలీవుడ్ లేదా కోలీవుడ్‌కు చెందిన మరో పాపులర్ నటిని ఎంపిక చేయాలని దర్శకుడు గోపీచంద్ మలినేని భావిస్తున్నారు. యాక్షన్, ఫ్యామిలీ సెంటిమెంట్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం బాలయ్య కెరీర్లో మరో మైలురాయిగా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
