Kajol: బైక్ కవర్ కప్పుకొచ్చావా.. కాజోల్‌పై నెటిజన్ల ట్రోలింగ్!

సెలబ్రిటీలు బయట వేడుకలకు వెళ్లేప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మరీ ముఖ్యంగా సినీ సెలబ్రిటీలైతే డ్రెస్సింగ్ నుండి అవుట్ లుక్ వరకు అన్నీ చూసుకొని వెళ్ళాలి. లేదంటే నెటిజన్ల...

Kajol: సెలబ్రిటీలు బయట వేడుకలకు వెళ్లేప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మరీ ముఖ్యంగా సినీ సెలబ్రిటీలైతే డ్రెస్సింగ్ నుండి అవుట్ లుక్ వరకు అన్నీ చూసుకొని వెళ్ళాలి. లేదంటే నెటిజన్ల చేతిలో బలి కావాల్సిందే. ఈ మధ్యనే షాహిద్ కపూర్ భార్య ముంబై విమానాశ్రయం నుండి వచ్చే వీడియో ఎంతగా వైరల్ అయిందో తెలిసిందే. పొట్టి నిక్కరులో షాహిద్ భార్య రావడంపై నెటిజన్లతో సహా ఆయన అభిమానులు విపరీతంగా ట్రోల్ చేశారు. ఇక, ఇప్పుడు ఆ వంతు సీనియర్ నటి, సీనియర్ హీరో అజయ్ దేవగన్ భార్య కాజోల్ కు వచ్చింది.

Shahid Kapoor: ప్యాంట్ మర్చిపోయావా.. హీరో భార్య డ్రెస్సింగ్‌పై ట్రోలింగ్!

అజయ్‌ తో వివాహం తర్వాత అదపాదడపా సినిమాలు చేస్తున్న కాజోల్ తాజాగా దుబాయ్ లో జరిగిన ఓ అవార్డు ఫంక్షన్‌కి హాజరైంది. బాడీ-కాన్ బ్లాక్ గౌన్ ధరించి కాజోల్ రెడ్‌ కార్పెట్‌పై నడిచింది. కానీ.. ఆమె ధరించిన డ్రెస్ ఏ మాత్రం నెటిజన్లకు నచ్చలేదు. దీంతో నెటిజన్లు ఓ రేంజ్ లో సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలు పెట్టారు. బైక్ కవర్ డ్రెస్ లాగా కప్పుకొని వచ్చావా కాజల్ జీ అని కొందరంటే.. కాదు కాదు బ్లాంకెట్ కప్పుకొచ్చిది.. అవార్డు రాకపోతే కప్పుకొని అక్కడే పడుకోవచ్చని కొందరు ఆడేసుకుంటున్నారు.

Raviteja 70: జెట్ స్పీడ్‌తో మాస్ రాజా.. 70వ సినిమాకి ముహూర్తం!

కాజోల్ నిజానికి ఫ్యాషన్ లో ఎప్పుడూ ఇలా ట్రోల్స్ చూడలేదు. పైగా అందరిలా బక్కచిక్కిపోకుండా.. 47 ఏళ్ల వయసులో నిగనిగలాడుతూ కుర్ర హీరోయిన్లకు కాంపిటీషన్ ఇస్తుంది. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఫిట్నెస్ మైంటైన్ చేసే కాజోల్ చీర నుండి స్కర్ట్స్ వరకు ఏదేసినా ఇప్పటికీ బాలీవుడ్ జనాలు అలా చూస్తూ ఉండిపోతారు. కానీ.. ఇలా అనుకోకుండా అప్పుడప్పుడు కొత్త పోకడలు అలవాటు చేసుకొనేప్పుడు మిస్ ఫైర్ అవుతుంటాయనుకోవాలేమో!

ట్రెండింగ్ వార్తలు