Nitish Kumar : బీహార్ సీఎంపై ఆర్జేడీ ఎమ్మెల్యే ఆరోపణలు

మద్యపాన నిషేధం కంటితుడుపు చర్యగా ఆయన అభివర్ణించారు. ఈ విషయంలో సీఎం నితీశ్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వెల్లడించారు.

Nitish Kumar Used To Smoke Marijuana: రాజకీయ నాయకులు విమర్శలు…ప్రతి విమర్శలు చేసుకోవడం పరిపాటి. కానీ..కొన్ని విమర్శలు, దూషణలు వ్యక్తిగతంగా ఉండడంతో తీవ్ర దుమారం రేపుతుంటాయి. బీహార్ లో అధికారం చేజిక్కించుకుని…సీఎంగా అయిన నితీశ్ కుమార్ పై ఆర్జేడీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా…ఓ ఆర్జేడీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు గుప్పించారు. నితీశ్..అలవాటును మాత్రం ఎందుకు మానుకోవడం లేదని, ఆయన గంజాయి సేవిస్తారంటూ ఆరోపణలు గుప్పించడం దుమారం రేపుతోంది. గంజాయి కూడా మత్తు పదార్థం కిందకు వస్తుందని, దీనిపై కూడా నిషేధం ఉందనే విషయాన్ని ఆయన ప్రస్తావిస్తున్నారు.

Read More : Omicron Quarantine : ఒమిక్రాన్ భయం.. వారికి 7 రోజుల క్వారంటైన్ మస్ట్.. కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం

బీహార్ రాష్ట్రంలో మద్యంపై నిషేధం ఉన్న సంగతి తెలిసిందే. మద్యపానానికి వ్యతిరేకంగా అక్కడి ప్రజలతో ప్రతిజ్ఞలు చేయిస్తున్నారు. సామూహిక ప్రతిజ్ఞలు చేయించిన రెండు రోజుల తర్వాత..ఆర్జేడీ ఎమ్మెల్యే రాజవంశీ మహతో..సీఎం నితీశ్ పై సంచలన ఆరోపణలు గుప్పించారు. గంజాయి వ్యసనాన్ని ఆయన ఎందుకు వదులుకోవడం లేదని ప్రశ్నించారు. 2021, నవంబర్ 28వ తేదీ ఆదివారం మీడియాతో మాట్లాడారు. మద్యపాన నిషేధం కంటితుడుపు చర్యగా ఆయన అభివర్ణించారు. ఈ విషయంలో సీఎం నితీశ్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వెల్లడించారు. ప్రతి గ్రామంలో మద్యం దొరుకుతోందని, బలవంతంగా ప్రజలతో ఎందుకు ప్రతిజ్ఞలు చేయిస్తున్నారని విమర్శించారు.

Read More : Tallest Pier Bridge : భారతీయ రైల్వేకి కాదేదీ అసాధ్యం..ప్రపంచంలోనే ఎత్తైన పిల్లర్ బ్రిడ్జ్ మన దగ్గరే

బీహార్ రాష్ట్రంలో కొన్ని మాఫియాలు లిక్కర్ దందాను కొనసాగిస్తున్నాయని, పేద ప్రజలపై చర్యలు తీసుకొనే పోలీసులు…మాఫియాపై మాత్రం దృష్టి సారించడం లేదన్నారు. నవంబర్ 26వ తేదీ శుక్రవారం రాష్ట్ర అసెంబ్లీలో మద్యపాన వ్యతిరేకంగా సీఎం నితీశ్ ప్రతిజ్ఞ చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రజలు, అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలతో కూడా ప్రతిజ్ఞ చేయించారు. బీహార్ రాష్ట్రంలో కల్తీ మద్యం కారణంగా పలువురి ప్రాణాలు గాలిలో కలిసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎమ్మెల్యే రాజవంశీ మహతో చేసిన ఆరోపణలు రాజకీయ రచ్చకు దారి తీసే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు