Omicron Threat : ఒమిక్రాన్ ఎఫెక్ట్ – క్రిస్మస్, కొత్త సంవత్సర వేడుకలపై ఢిల్లీ ప్రభుత్వం ఆంక్షలు

ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. క్రిస్మస్,నూతన సంవత్సర వేడుకలపై నిషేధం విధించింది. సాంస్కృతిక కార్యక్రమాలకు, భారీ జన సమూహాలకు అనుమతి

Omicron Threat :  ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. క్రిస్మస్,నూతన సంవత్సర వేడుకలపై నిషేధం విధించింది. సాంస్కృతిక కార్యక్రమాలకు, భారీ జన సమూహాలకు అనుమతి లేదని   ఢిల్లీ విపత్తు నిర్వహణ విభాగం అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

కోవిడ్, ఒమిక్రాన్ వ్యాప్తి నిరోధానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.  బహిరంగ ప్రదేశాల్లో తప్పని సరిగా మాస్క్ ధరించాలని ఆదేశించారు. మాస్కు లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఢిల్లీ అంతటా అన్ని సామాజిక, రాజకీయ, క్రీడలు,వినోదం సాంస్కృతిక, మతపరమైన, పండుగలకు సంబంధించిన సమావేశాలు సమ్మేళనాలు నిషేధించబడ్డాయని పేర్కోంది.  అన్ని రెస్టారెంట్లు, బార్లు, 50 శాతం సీటింగ్ కు మాత్రమే అనుమతించబడతాయని తెలిపింది. ఈ నిషేధాజ్ఞలు జనవరి 1వ తేదీ రాత్రివరకు కొనసాగుతాయని పేర్కోన్నారు.

Also Read : AP Covid Cases : ఏపీలో కొత్తగా 103 కోవిడ్ కేసులు… 175 మంది కోలుకున్నారు

మరోవైపు   కర్ణాటకలోకూడా ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై  కోవిడ్ నూతన మార్గదర్శకాలు జారీ చేశారు. డిసెంబర్ 30 నుండి జనవరి 2వరకు రాష్ట్రంలో ఎలాంటి పార్టీలు సామూహిక కార్యక్రమాలకు అనుమతి లేదన్నారు.

దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య  213కి  చేరిందని బుధవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటి వరకు 90 మంది రోగులు ఈవేరియంట్ నుంచి కోలుకున్నారని తెలిపింది. ఒమిక్రాన్ ఇప్పటి వరకు 15 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో  నమోదయ్యింది. వీటిలో ఎక్కువగా ఢిల్లీ, మహారాష్ట్ర, తెలంగాణ కర్ణాటకలో ఉన్నాయని మంత్రిత్వశాఖ విడుదల చేసిన లెక్కలు చెపుతున్నాయి.

ట్రెండింగ్ వార్తలు