Organic Prawn Farming : ఆర్గానిక్ పద్ధతిలో రోయ్యల సాగు

రొయ్యల పెంపకంలో అనేక సమస్యలు ఉంటాయి. అధిక ఉష్ణోగ్రతలు వున్న వాతావరణంలో రొయ్యల పెరుగుదల వేగంగా వుంటుంది. . నీటి ఉష్ణోగ్రత 20డిగ్రీలకు మించకుండా ఉన్న చెరువుల్లో రొయ్యల పెరుగుదల ఆశాజనకంగా వుంటుంది.

Organic Prawn Farming : దేశంలో రొయ్య కల్చర్ కు పేరెన్నికగన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తన ప్రత్యేకతను చాటుతోంది. దేశంలోని రొయ్య ఉత్పత్తిలో ఏపీ వాటా 50 శాతంకు పైగా వుండటం విశేషం. రొయ్యల సాగును అన్ని కాలాల్లో చేపడుతున్నా… వర్షాకాలం మాత్రం ఈ కల్చర్ కు అత్యంత గడ్డుకాలంగా చెబుతారు. అధిక వర్షాలు, ఎండలతో, తీవ్ర వాతావరణ ఒడిదుడుకుల మధ్య సాగు కొనసాగుతుంది. దినదినాభివృద్ధి చెందుకున్న ఆక్వారంగంలో, సమస్యలు కూడా అంతే వేగంగా పెరిగిపోయాయి.

READ ALSO : Shrimp farming: బయోప్లాక్ విధానంలో..సూపర్ ఇంటెన్సివ్ రొయ్యల సాగు

ముఖ్యంగా రొయ్యల సాగులో వివిధ బాక్టీరియా వైరస్ వ్యాధుల దాడి కల్చర్ ను అతలాకుతలం చేస్తోంది. వర్షాకాలంలో చేపట్టే కల్చర్ లో వాతావరణ ఒడిదుడుకులు తీవ్రంగా ఉండటంతో ఈ సమస్యల తీవ్రత మరింత పెరుగుతోంది. తరచూ రొయ్యలు ఒత్తిడికి లోనవటం జరుగుతుంది. పైగా చెరువులకు కొత్తనీరు ఎక్కువ పెడతారు కనుక, వివిధ హానికారక క్రిములు, బాక్టీరియా, వైరస్ ల బెడద ఎక్కువ వుంటుంది. అందువల్ల వర్షాకాలంలో కల్చర్ ను సాధ్యమైనంత తగ్గించుకుంటారు.

పశ్చిమగోదావరి జిల్లా, కివీడు మండలం, ఆకివీడు గ్రామానికి చెందిన రైతు శ్రీనివాస రాజు ఎలాంటి రసాయనా వాడకుండా కేవలం సేంద్రియ విధానంలో పెంపకం చేపట్టి అధిక దిగుబడిని తీస్తున్నారు. సాధారణంగా రొయ్యలు చలికాలంలో ఎదుగుదల ఉండదు. కానీ రైతు ఆచరించిన పద్ధతుల కారణంగా కిలోకి30 కౌంట్ వచ్చాయి. పెట్టుబడి కూడా చాలా తక్కువ.. దీంతో రైతు చాలా ఆనందంగా ఉన్నారు. ఈ విధానంలో సాగుచేస్తే ఎలాంటి రైతుకైనా నష్టాలు రావంటున్నారు.

READ ALSO : Fish Farming : వేసవిలో చేపల చెరువుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

రొయ్యల పెంపకంలో అనేక సమస్యలు ఉంటాయి. అధిక ఉష్ణోగ్రతలు వున్న వాతావరణంలో రొయ్యల పెరుగుదల వేగంగా వుంటుంది. . నీటి ఉష్ణోగ్రత 20డిగ్రీలకు మించకుండా ఉన్న చెరువుల్లో రొయ్యల పెరుగుదల ఆశాజనకంగా వుంటుంది. వర్షాకాలం, శీతాకాలాల్లో వాతావరణంలో తీవ్ర హెచ్చుతగ్గులు వల్ల సమస్యలు ఎక్కువ. నీటి ఉదజని సూచిక కూడా నిర్ధేశించిన రీతిలో వుండేలా జాగ్రత్త వహించాలి.

ముఖ్యంగా రొయ్య పిల్లలను వదిలేముందు చెరువులో జంతు, వృక్ష ప్లవకాల సాంద్రత తగిన నిష్పత్తిలో వృద్ధి అయ్యేలా చర్యలు తీసుకోవాల్సి వుంటుంది. ఇవి చిన్న పిల్లలకు తొలి దశలో సహజ ఆహారంగా ఉపయోగపడి ఆరోగ్యంగా పెరుగుతాయంటున్నారు ఆక్వారంగ నిపుణుడు జల్లి వెంకటేష్.

 

ట్రెండింగ్ వార్తలు