పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోర్టులో లొంగిపోతారా?

కేవలం అనుమానం మాత్రమేనని, ఎలాంటి సమాచారం లేదని పోలీసులు తెలిపారు.

Pinnelli Ramakrishna Reddy : పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోర్టులో లొంగిపోతారనే ప్రచారం జరుగుతోంది. నరసరావుపేట కోర్టులో లొంగిపోతారనే ప్రచారంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. కోర్టు ఆవరణలో భారీగా పోలీసులు మోహరించారు. కేవలం అనుమానం మాత్రమేనని, ఎలాంటి సమాచారం లేదని పోలీసులు తెలిపారు.

గత రెండు రోజులుగా పిన్నెల్లి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇవాళ ఉదయం నుంచి హైడ్రామా నడుస్తోంది. నరసరావుపేట కోర్టులో పిన్నెల్లి లొంగిపోతారనే ప్రచారం జరిగింది. దీంతో అక్కడ పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. పిన్నెల్లి కోర్టులో లొంగిపోతారనే సమాచారం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. దీంతో కోర్టు చుట్టూ కేంద్ర బలగాలు మోహరించాయి. ఏ క్షణమైనా పిన్నెల్లిని కచ్చితంగా అరెస్ట్ చేస్తామని ఓ పక్కన పోలీసులు చెబుతున్నారు.

Also Read : ఘోర పరాజయం తప్పదు..! చిచ్చు రాజేసిన పీకే వ్యాఖ్యలు, భగ్గుమంటున్న వైసీపీ నాయకులు

ట్రెండింగ్ వార్తలు