Jabardasth Stars : జబర్దస్త్ రామ్ ప్రసాద్, గెటప్ శ్రీను, సుధీర్ కలిసి మరో సినిమా.. కానీ ఈసారి డైరెక్టర్ గా మారబోతున్న..

జబర్దస్త్ లో పదేళ్లకు పైగా స్కిట్స్ చేస్తూ స్టార్స్ గా ఎదిగారు రామ్ ప్రసాద్, సుధీర్, గెటప్ శ్రీను.

Sudheer – Getup Srinu – Ram Prasad : జబర్దస్త్ కామెడీ షోతో ఎంతోమంది స్టార్ కమెడియన్స్ గా మారారు. హీరోలు, దర్శకులు, రైటర్స్ గా కూడా మారారు. ఇక జబర్దస్త్ లో పదేళ్లకు పైగా స్కిట్స్ చేస్తూ స్టార్స్ గా ఎదిగారు రామ్ ప్రసాద్, సుధీర్, గెటప్ శ్రీను. ఈ ముగ్గురు క్లోజ్ ఫ్రెండ్స్ అవ్వడమే కాక ఒకే టీమ్ లో ఉంటూ స్కిట్స్ చేస్తూ పాపులారిటీ తెచ్చుకున్నారు. ఆ తర్వాత ముగ్గురూ కూడా క్యారెక్టర్ ఆర్టిస్టులుగా, కమెడియన్స్ గా సినిమాల్లో బిజీ అయ్యారు.

ఇప్పటికే సుధీర్ హీరోగా సినిమాలు చేస్తూ బిజీ అయ్యాడు. గెటప్ శ్రీను సినిమాలు చేస్తూ రాజు యాదవ్ సినిమాతో హీరోగా మారాడు. ఇక రామ్ ప్రసాద్ స్వతహాగా రైటర్ కావడంతో పలు సినిమాలకు రైటర్ గా కూడా పనిచేస్తున్నాడు. ఈ ముగ్గురు కలిసి గతంలో 3 మంకీస్ అనే సినిమా కూడా చేశారు. అయితే త్వరలోనే ఈ ముగ్గురు కలిసి మరో సినిమా చేయబోతున్నారని తెలుస్తుంది.

Also Read : Getup Srinu : ఆ సినిమా కోసం కష్టాలు పడ్డ గెటప్ శ్రీను.. ఆఖరికి కార్‌లో బట్టలు మార్చుకొని..

గెటప్ శ్రీను హీరోగా, అంకిత ఖారత్ హీరోయిన్ గా కొత్త దర్శకుడు కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాజు యాదవ్’ సినిమా రేపు మే 24న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతూ గెటప్ శ్రీను ఈ విషయాన్ని తెలిపాడు. గెటప్ శ్రీను మాట్లాడుతూ.. నేను, సుధీర్, రామ్ ప్రసాద్ కలిసి ఇంకో సినిమా చేస్తాం. అయితే రామ్ ప్రసాద్ మంచి రైటర్. పదేళ్లుగా జబర్దస్త్ కి, పలు సినిమాలకు రైటర్ గా పనిచేసాడు. మా కోసం ఒక కథ రాస్తున్నాడు రామ్ ప్రసాద్. అతనే దర్శకుడిగా మారి నన్ను, సుధీర్ ని పెట్టి సినిమా చేయాలనీ చూస్తున్నాడు. ఫ్రెండ్షిప్ విలువలు, కామెడీతో ఈ సినిమా ఉంటుంది అని తెలిపారు.

దీంతో సుధీర్, గెటప్ శ్రీను హీరోలుగా రామ్ ప్రసాద్ దర్శకత్వంలో సినిమా త్వరలోనే రాబోతుందని, ఆల్రెడీ వర్క్ జరుగుతుందని తెలుస్తుంది. మరి మరోసారి ఈ ముగ్గురు తెరపై ఎలా మెప్పిస్తారో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు