Getup Srinu : ఆ సినిమా కోసం కష్టాలు పడ్డ గెటప్ శ్రీను.. ఆఖరికి కార్‌లో బట్టలు మార్చుకొని..

గెటప్ శ్రీను ఇపుడు హీరోగా 'రాజు యాదవ్' సినిమాతో రాబోతున్నాడు.

Getup Srinu : ఆ సినిమా కోసం కష్టాలు పడ్డ గెటప్ శ్రీను.. ఆఖరికి కార్‌లో బట్టలు మార్చుకొని..

Getup Srinu says Interesting Facts about Raju Yadav Movie

Getup Srinu : గెటప్ శ్రీను.. జబర్దస్త్ తో మంచి పేరు తెచ్చుకొని, పలు గెటప్స్ తో ప్రేక్షకులని అలరించి టీవీతో స్టార్ అయి సినిమాల్లో కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ అయ్యాడు. పలు సినిమాలతో బిజీగా ఉన్న గెటప్ శ్రీను ఇపుడు హీరోగా ‘రాజు యాదవ్’ సినిమాతో రాబోతున్నాడు. గెటప్ శ్రీను హీరోగా, అంకిత ఖారత్ హీరోయిన్ గా కొత్త దర్శకుడు కృష్ణమాచారి దర్శకత్వంలో ‘రాజు యాదవ్’ సినిమా తెరకెక్కుతుంది.

హీరోకి అనుకోకుండా మొహానికి బాల్ తగిలితే ఎప్పుడూ నవ్వుతూ ఉండే ఫేస్ లాగా మారిపోతే అతను ఎదుర్కున్న పరిస్థితులు, కష్టాలు ఏంటి అనే కథాంశంతో కామెడీ ఎమోషనల్ గా రాజు యాదవ్ సినిమాని తెరకెక్కించారు. రాజు యాదవ్ సినిమా రేపు మే 24న రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో మీడియాతో ముచ్చటించిన గెటప్ శ్రీను పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు.

Also Read : Laya : ఒకప్పటి హీరోయిన్ లయ ఆ గేమ్ లో నేషనల్ ఛాంపియన్ అని తెలుసా?

హీరోలను చూసి సినిమాలకు ప్రేక్షకులు వస్తారు. ఈ సినిమాకి మీరే హీరో కాబట్టి బడ్జెట్ విషయంలో కూడా ఆలోచించారా? నిర్మాతకు మీరు ఎలా సపోర్ట్ చేశారు అని మీడియా ప్రతినిధి అడగగా గెటప్ శ్రీను సమాధానమిస్తూ.. బడ్జెట్ విషయంలో ముందు నుంచి కంట్రోల్ లో ఉన్నాము. సినిమా చాలా వరకు బస్తీలలో, లోకక లొకేషన్స్ లోనే షూటింగ్ చేసాము కాబట్టి కారవాన్ కూడా వద్దన్నాను. ఎక్స్‌ట్రా ఖర్చు ఎందుకు, ఆ డబ్బేదో ప్రొడక్షన్, ప్రమోషన్స్ లో పెట్టుకోవచ్చు అనుకున్నాను. బట్టలు మార్చుకోవాల్సి వస్తే షూటింగ్ లొకేషన్స్ లో ఎవరో ఒకరి ఇంట్లో, లేదా కార్ లో వెనక సీట్ లో కూర్చొని మార్చుకునేవాడ్ని. ఈ సినిమాకు ఎక్స్‌ట్రా ఖర్చు ఏం పెట్టించలేదు. ఇప్పటికే డిజిటల్, శాటిలైట్, థియేట్రికల్.. అన్ని రైట్స్ అమ్ముడుపోయి ప్రాఫిట్స్ లో ఉంది సినిమా. నిర్మాతలు బాగుంటే నాకు ఇంకా సినిమాలు వస్తాయి. నాకు పాత్ర నచ్చితే తక్కువ రెమ్యునరేషన్ కి అయినా చేస్తాను అని తెలిపారు.

ఇలా తనే హీరో కావడంతో సినిమాని తన భుజాలపై వేసుకొని కారవాన్ కూడా వద్దని, షూటింగ్ లొకేషన్స్ లో కూడా నిర్మాతకు సపోర్ట్ గా నిలిచాడు గెటప్ శ్రీను. ఈ విషయంలో నెటిజన్లు శ్రీనుని అభినందిస్తున్నారు.