Laya : ఒకప్పటి హీరోయిన్ లయ ఆ గేమ్ లో నేషనల్ ఛాంపియన్ అని తెలుసా?

లయ మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుండటంతో పలు ఇంటర్వ్యూలు ఇస్తూ బోలెడన్ని ఆసక్తికర విషయాలు తెలుపుతుంది.

Laya : ఒకప్పటి హీరోయిన్ లయ ఆ గేమ్ లో నేషనల్ ఛాంపియన్ అని తెలుసా?

Do You Know Senior Actress Laya Played Nationals in a Game

Laya : మన సినిమా సెలబ్రిటీలు సినిమాల్లోనే కాకుండా వేరే రంగాల్లో కూడా చాలా ట్యాలెంట్ ఉండి, చాలా సాధించిన వాళ్ళు ఉన్నారు. ఆ లిస్ట్ లో ఒకప్పటి సీనియర్ నటి లయ కూడా ఉంది. స్వయంవరం, హనుమాన్ జంక్షన్, ప్రేమించు, మిస్సమ్మ.. లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులని మెప్పించింది లయ. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో లయ దాదాపు 40 సినిమాల్లో నటించింది. 2006 లో పెళ్లి చేసుకొని అమెరికా వెళ్లి సినిమాలకు దూరమైంది. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత తెలుగు సినీ పరిశ్రమకు తిరిగొచ్చింది లయ.

నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో తమ్ముడు అనే సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ హీరోయిన్స్ గా నటిస్తుండగా సీనియర్ నటి లయ ఈ సినిమాతో తెలుగులో రీఎంట్రీ ఇస్తుంది. తమ్ముడు సినిమాలో లయ నితిన్ కి అక్కగా నటిస్తుందని సమాచారం. లయ మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుండటంతో పలు ఇంటర్వ్యూలు ఇస్తూ బోలెడన్ని ఆసక్తికర విషయాలు తెలుపుతుంది.

Also Read : Satyabhama : హమ్మయ్య ‘సత్యభామ’ వచ్చేస్తుంది.. కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్..

తాజాగా అలీతో సరదాగా ప్రోగ్రాంలో లయ పాల్గొని తాను చెస్ ఛాంపియన్ అని తెలిపింది. లయ మాట్లాడుతూ.. నేను చిన్నప్పట్నుంచి చెస్ నేర్చుకున్నాను. కోనేరు హంపి వాళ్ళ నాన్న దగ్గర చెస్ నేర్చుకున్నాను. 7 సార్లు నేషనల్స్ కి వెళ్లి ఆడాను. కాకపోతే ఒక్కసారే గెలిచాను అని తెలిపింది. ఇన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించిన లయ నేషనల్ లెవల్స్ లో చెస్ ఆడిందా అని ఆశ్చర్యపోతున్నారు.