Satyabhama : హమ్మయ్య ‘సత్యభామ’ వచ్చేస్తుంది.. కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్..

కాజల్ అగర్వాల్ సత్యభామ సినిమా పలుమార్లు వాయిదా పడింది. తాజాగా కొత్త డేట్ ప్రకటించారు.

Satyabhama : హమ్మయ్య ‘సత్యభామ’ వచ్చేస్తుంది.. కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్..

Kajal Aggarwal Satyabhama Movie New Releasing Date Announced

Satyabhama : కాజల్ అగర్వాల్(Kajal Aggarwal) పెళ్లి తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని ఇప్పుడు సత్యభామ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. కాజల్ మొదటిసారి చేసిన ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా ఇది. ఇందులో కాజల్ పోలీసాఫీసర్ గా నటించింది. ఇప్పటికే రిలీజ్ చేసిన సత్యభామ టీజర్, సాంగ్స్ తో సినిమాపై మంచి అంచనాలు పెంచారు. ప్రస్తుతం కాజల్ సత్యభామ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ సినిమాని సుమన్ చిక్కాల తెరకెక్కించగా నవీన్ చంద్ర, ప్రకాష్ రాజ్, నాగినీడు, హర్షవర్ధన్.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు.

Also Read : Ilaiyaraaja : ‘మంజుమ్మల్ బాయ్స్’ సినిమా టీంకు కూడా లీగల్ నోటీసులు పంపిన ఇళయరాజా.. ఇంకెంతమందికి పంపుతారో..

ఇప్పటికే సత్యభామ సినిమా పలుమార్లు వాయిదా పడింది. మే 17 నుంచి మే 31 అనుకున్నారు కానీ సినిమా మళ్ళీ వాయిదా పడి తాజాగా కొత్త డేట్ ప్రకటించారు. కాజల్ సత్యభామ సినిమా జూన్ 7న రిలీజ్ కాబోతున్నట్టు మూవీ యూనిట్ ప్రకటించారు. దీంతో కాజల్ అభిమానులు మొదటిసారి తమ ఫేవరేట్ హీరోయిన్ ని పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ లో సత్యభామగా చూడటానికి ఎదురుచూస్తున్నారు.

ఇక సత్యభామ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని మే 24న సాయంత్రం 6.30 గంట‌ల‌ నుండి హైద‌రాబాద్‌లోని ఐటీసీ కోహెనూర్‌లో నిర్వ‌హించ‌బోతున్నట్టు ప్రకటించారు మూవీ యూనిట్. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి బాలకృష్ణ ముఖ్య అతిథిగా రాబోతున్నాడు. దీంతో బాలయ్య అభిమానులు కూడా ఈ ఈవెంట్ కోసం ఎదురుచూస్తున్నారు.