Google Pay Later Option : ఆన్‌‌లైన్ షాపింగ్ చేస్తున్నారా? గూగుల్ పేలో 3 సరికొత్త ఫీచర్లు.. ఇప్పుడే కొనండి.. తర్వాత చెల్లించండి!

Google Pay Later Option : ఈ కొత్త  ఫీచర్లతో చెల్లింపు చేయడానికి ముందు కార్డ్ బెనిఫిట్స్ గురించి తెలుసుకోవాలి. వినియోగదారులు ‘ఇప్పుడే కొనుగోలు చేయండి.. తర్వాత చెల్లించండి’ అనే ఆప్షన్లను యాక్సెస్ చేయవచ్చు.

Google Pay Later Option : ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా? ప్రముఖ డిజిట్ పేమెంట్ యాప్ గూగుల్ పే తమ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది. సురక్షితమైన పేమెంట్ల కోసం అత్యంత ఆకర్షణీయమైన మూడు కొత్త ఫీచర్లను అందిస్తోంది. ఈ కొత్త  ఫీచర్లతో చెల్లింపు చేయడానికి ముందు కార్డ్ బెనిఫిట్స్ గురించి తెలుసుకోవాలి. వినియోగదారులు ‘ఇప్పుడే కొనుగోలు చేయండి.. తర్వాత చెల్లించండి’ అనే ఆప్షన్లను యాక్సెస్ చేయవచ్చు. కార్డ్ వివరాలను సురక్షితంగా ఆటోఫిల్ చేయవచ్చు.

పేమెంట్ ముందు కార్డ్ బెనిఫిట్స్ చెక్ చేయండి :
క్రెడిట్ కార్డ్‌లు తరచుగా కొనుగోళ్లపై క్యాష్‌బ్యాక్, విమానాలు లేదా హోటల్ బసల కోసం రీడీమ్ చేయగల ట్రావెల్ పాయింట్‌లు, రెస్టారెంట్‌లలో డైనింగ్‌పై తగ్గింపు వంటి అనేక రకాల రివార్డ్‌లతో వస్తాయి. ఈ పెర్క్‌లు చాలా విలువైనవి అయినప్పటికీ, నిర్దిష్ట కొనుగోలుకు ఏ కార్డ్ బెస్ట్ రివార్డ్‌లను అందిస్తుందో గుర్తుంచుకోవడం కార్డ్ హోల్డర్‌లకు కష్టంగా ఉంటుంది. ఉదాహరణకు, ఒక కార్డ్ కిరాణా షాపింగ్‌పై అదనపు క్యాష్‌బ్యాక్‌ను అందించవచ్చు. మరొకటి ప్రయాణ సంబంధిత ఖర్చులకు మరిన్ని పాయింట్‌లను అందించవచ్చు.

Read Also : Apple iPhone 14 Sale : అమెజాన్‌లో ఆపిల్ ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్.. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు!

చెక్అవుట్ సమయంలో ప్రతి కార్డ్ బెనిఫిట్స్ కోసం కొత్త ఫీచర్‌ను గూగుల్ పే ప్రవేశపెట్టింది. వినియోగదారులు తమ ప్రస్తుత కొనుగోలుకు ఏ కార్డ్ బెస్ట్ రివార్డ్‌లను అందిస్తుందో త్వరగా గుర్తించవచ్చు. డెస్క్‌టాప్‌లో క్రోమ్ బ్రౌజర్ ఉపయోగించి చెక్ చేసినప్పుడు అమెరికన్ ఎక్స్‌ప్రెస్ లేదా క్యాపిటల్ వన్ కార్డ్‌లను కలిగి ఉంటే.. ఆటోఫిల్ డ్రాప్-డౌన్ మెనులో కార్డ్ బెనిఫిట్స్ లిస్టు చూడవచ్చు. ప్రతి కార్డ్ రివార్డ్ ప్రోగ్రామ్‌ను మాన్యువల్‌గా చెక్ చేయాల్సిన అవసరం లేకుండా, గరిష్ట ప్రయోజనాలకు ఏ కార్డ్‌ని ఉపయోగించాలో యూజర్లు వెంటనే చూడవచ్చు.

ఉదాహరణకు.. విమాన టిక్కెట్‌ను కొనుగోలు చేస్తుంటే.. మీ కార్డ్‌లలో ఒకటి అదనపు ట్రావెల్ పాయింట్‌లను అందిస్తుంది. అలాంటి కొనుగోలుకు ఇది బెస్ట్ ఆప్షన్. మీరు భోజనం చేస్తుంటే.. మరో కార్డ్ రెస్టారెంట్ ఖర్చులకు హై క్యాష్‌బ్యాక్‌ను అందించవచ్చు. భవిష్యత్తులో మరింత మంది క్రెడిట్ కార్డ్ జారీచేసేవారిని చేర్చేందుకు గూగుల్ పే ఈ ఫీచర్‌ను విస్తరించాలని యోచిస్తోంది. విస్తృత శ్రేణి వినియోగదారులకు మరింత ఉపయోగకరంగా మారనుంది. చెక్అవుట్ వద్ద కార్డ్ బెనిఫిట్స్ చూపడం ద్వారా వినియోగదారులు తమ క్రెడిట్ కార్డ్‌ల నుంచి తక్కువ శ్రమతో ఎల్లప్పుడూ అత్యధిక విలువను పొందేలా గూగుల్ పే సర్వీసును అందించనుంది.

ఇప్పుడే కొనండి.. పే లేటర్ ఆప్షన్ :
ఇప్పుడే కొనుగోలు చేయండి.. పే లేటర్ చెల్లించండి. (BNPL) అనేది ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసేందుకు అద్భుతమైన ఆప్షన్. ఎందుకంటే.. యూజర్ల కోసం సౌకర్యవంతమైన పేమెంట్ ఆప్షన్ అందిస్తుంది. బీఎన్‌పీఎల్‌తో దుకాణదారులు వెంటనే కొనుగోలు చేయవచ్చు. పూర్తి మొత్తాన్ని ముందస్తుగా చెల్లించకుండా వరుస ఈఎంఐల ద్వారా కాలక్రమేణా చెల్లించవచ్చు. ఈ ఏడాది ప్రారంభంలో గూగుల్ పే అఫ్రిమ్, జిప్ వంటి బీఎన్‌పీఎల్ ఆప్షన్లను ఒకేచోట ప్రారంభించింది. ఈ సర్వీసుల ద్వారా యూజర్లు తమ చెల్లింపులను ప్రొవైడర్ నిబంధనలను బట్టి చిన్న, పెద్ద విభాగాలగా అనుమతిస్తాయి. గూగుల్ పే, బీఎన్‌‌పీఎల్ ఆప్షన్ లభ్యతను యునైటెడ్ స్టేట్స్ అంతటా వెబ్‌సైట్‌లు, ఆండ్రాయిడ్ యాప్‌లకు విస్తరించింది. ఇప్పుడు మరిన్ని ఆన్‌లైన్ స్టోర్‌లు, సర్వీసులు గూగుల్ పే ద్వారా బీఎన్‌పీఎల్ సపోర్టు ఇస్తున్నాయి.

షాపర్‌లకు ఎక్కువ ఆప్షన్లను అందిస్తాయి. చెక్ అవుట్ సమయంలో గూగుల్ పే యూజర్లు తమ ప్రస్తుత బీఎన్‌పీఎల్ అకౌంట్లను లింక్ చేయవచ్చు లేదా నేరుగా గూగుల్ పేలో కొత్తదానికి సైన్‌అప్ చేయవచ్చు. గూగుల్ పే యూజర్లు చెక్అవుట్ ప్రాసెస్ నుంచి నిష్క్రమించకుండా లేదా మల్టీ వెబ్‌సైట్‌లను విజిట్ చేయకుండానే బీఎన్‌పీఎల్ ఆప్షన్ బెనిఫిట్స్పొందవచ్చు. ఉదాహరణకు.. కొత్త ఫోన్‌ని కొనుగోలు చేస్తుంటే.. మొత్తం ఖర్చును ముందుగా చెల్లించకూడదనుకుంటే.. చెక్అవుట్ సమయంలో (BNPL) ఆప్షన్ ఎంచుకోవచ్చు. మీరు కొన్ని నెలల పాటు పేమెంట్లను చేయొచ్చు. మీ బడ్జెట్‌కు తగిన విధంగా చేయొచ్చు. ఈ ఫ్లెక్సిబిలిటీ ముఖ్యంగా క్యాష్ ప్లోను మెయింటైన్ చేయడంతో పాటు ఆర్థిక ఇబ్బందులను కలిగించే భారీ చెల్లింపులను నివారించవచ్చు.

పిన్, ఫేస్ లేదా స్కాన్‌తో కార్డ్ వివరాలు :
ఆటోఫిల్ అనేది ఆన్‌లైన్ చెక్అవుట్ సమయంలో మీ షిప్పింగ్, బిల్లింగ్, పేమెంట్ వివరాలను ఆటోమాటిక్‌గా ఎంటర్ చేయడం ద్వారా సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. గూగుల్ పే ఈ ఫీచర్‌ని వేగవంతంగా మాత్రమే కాకుండా మరింత సురక్షితంగా అందిస్తుంది. ఈ కొత్త అప్‌గ్రేడ్ ఎలాంటి అంతరాయం లేని షాపింగ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. మీ సున్నితమైన సమాచారాన్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. మీరు క్రోమ్ లేదా ఆండ్రాయిడ్‌‌లో గూగుల్ పే ఉపయోగించి మీ కార్డ్ వివరాలను ఆటోఫిల్ చేసేందుకు ఫింగర్ ఫ్రింట్ ఐడెంటిటీ, ఫేస్ స్కాన్ లేదా మీ డివైజ్ స్క్రీన్ లాక్ పిన్ వంటి బయోమెట్రిక్ అథెంటికేషన్ పద్ధతులను వినియోగించవచ్చు.

ఈ అప్‌గ్రేడ్ ద్వారా ఇకపై మీ కార్డ్ సెక్యూరిటీ కోడ్‌ను మాన్యువల్‌గా ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఈ బయోమెట్రిక్ పద్ధతుల్లో మీ ఐడెంటిటీని అథెంటికేషన్ చేయమని గూగుల్ పే యూజర్లను అడుగుతుంది. ధృవీకరించిన తర్వాత మీ కార్డ్ వివరాలు ఆటోమాటిక్‌గా డిటెక్ట్ అవుతాయి. తద్వారా మీ పేమెంట్ త్వరగా సురక్షితంగా కొనసాగించవచ్చు. మీ ఫోన్‌లో ఇప్పటికే ఇంటర్నల్ సెక్యూరిటీ ఫీచర్లను ఈ మెథడ్ ప్రభావితం చేస్తుంది. అయినప్పటికీ, మీ పేమెంట్ డేటాను ఈ ఫీచర్ ప్రొటెక్ట్ చేస్తుంది.

Read Also : iPhone 16 Pro Display : ఆపిల్ ఐఫోన్ 15 ప్రోతో పోలిస్తే.. రాబోయే ఐఫోన్ 16 ప్రోలో 20శాతం బ్రైట్‌నెస్ డిస్‌ప్లే.. కొత్త క్యాప్చర్ బటన్..!

ట్రెండింగ్ వార్తలు