ఏపీ హైకోర్టును ఆశ్రయించిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి..!

లంచ్ మోషన్ పిటిషన్ పై విచారణకు ఏపీ హైకోర్టు అనుమతించింది.

Pinnelli Ramakrishna Reddy : వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ కు పోలీసులు ప్రయత్నిస్తుండగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ముందస్తు బెయిల్ కోసం పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ కోరుతూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. లంచ్ మోషన్ పిటిషన్ పై విచారణకు ఏపీ హైకోర్టు అనుమతించింది. కాసేపట్లో ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జరపనుంది.

ఈవీఎం ధ్వంసం కేసులో పిన్నెల్లి గత రెండు రోజులుగా పరారీలో ఉన్నారు. ఆయన కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. పిన్నెల్లి హైదరాబాద్ లో ఉన్నారనే అనుమానంతో ఒక టీమ్ అక్కడ గాలింపు చర్యలు చేపట్టింది. పిన్నెల్లి ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉందో ఆయా చోట్ల వెతుకుతున్నారు. పిన్నెల్లి కదలికలపై నిఘా పెట్టారు. పిన్నెల్లి వ్యవహారంలో ఎన్నికల కమిషన్ చాలా సీరియస్ గా ఉంది. దీంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. తాను ఎక్కడ కనిపించినా అరెస్ట్ చేస్తారనే ఆందోళన చెందిన పిన్నెల్లి.. ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టింది కోర్టు.

ఈ పిటిషన్ పై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పిన్నెల్లి బెయిల్ పిటిషన్ మీద ఏ విధంగా ముందుకెళ్లాలి అన్నదానిపై ఎన్నికల కమిషన్ న్యాయ నిపుణులతో చర్చించింది. ఎట్టి పరిస్థితుల్లో పిన్నెల్లిని అరెస్ట్ చేయాలని ఈసీ భావిస్తోందని సమాచారం.

Also Read : ఘోర పరాజయం తప్పదు..! చిచ్చు రాజేసిన పీకే వ్యాఖ్యలు, భగ్గుమంటున్న వైసీపీ నాయకులు

 

 

ట్రెండింగ్ వార్తలు