OTT Release: ధియేటర్లలోనే కాదు ఓటీటీల్లో కూడా పెద్ద సినిమాల జాతర నడుస్తుంది. బిగ్ స్క్రీన్ లో బ్లాక్ బస్టర్ అయిన సినిమాలతో పాటు వెబ్ సిరీస్, హాలీవుడ్ సినిమాలు ఓటీటీలోకి రాబోతున్నాయి. ఒకవైపు థియేటర్లలో భారీ సినిమాలు రిలీజ్ అవుతున్నా OTTలో మాత్రం గ్రాండ్ కంటెంట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాయి. OTTలలో విడుదల అవుతున్న సినిమాపై ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తుండడంతో అందుకు తగ్గట్టుగానే OTT సంస్థలు ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో దూసుకొస్తున్నాయి.
OTT Release: థియేటర్లకు ధీటుగా తగ్గేదేలే అంటున్న ఓటీటీలు!
మరి ఈ వారం ఏ సినిమా ఎప్పుడు ఏ ఓటీటీలోకి రాబోతోందో డీటెయిల్డ్ గా చూద్దాం. గంగుబాయి కతియావాడి తెలుగు వెర్షన్ ఏప్రిల్ 26న నెట్‌ఫ్లిక్స్ లో విడుదల కానుంది. గంగూబాయితో పాటు హాలీవుడ్ మూవీ 365 డేస్: దిస్ డే ఏప్రిల్ 27న, మిషన్ ఇంపాజిబుల్ తెలుగు ఏప్రిల్ 29, ఓ జార్క్ ఏప్రిల్ 29, ఆక్వాఫినా ఈజ్ నోరా ఫ్రమ్ క్వీన్స్ ఏప్రిల్ 29 కూడా నెట్‌ఫ్లిక్స్ లోనే విడుదల కానున్నాయి.
Theaters VS OTT: నువ్వా నేనా.. టైమ్ చూసి దెబ్బ కొడుతున్న ఓటీటీలు!
నమస్తే అమెరికా (హిందీ) ఏప్రిల్ 25, బ్యారీ (వెబ్ సిరీస్, సీజన్ 3) ఏప్రిల్ 25, మిషన్ సిండ్రెల్లా (హిందీ) ఏప్రిల్ 29న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుండగా.. నెవర్ కిస్ యువర్ బెస్ట్‌ఫ్రెండ్ (హిందీ) ఏప్రిల్ 29న జీ5లో రిలీజ్ చేయనున్నారు. అన్డన్ (కార్టూన్ సిరీస్) ఏప్రిల్ 29న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ చేయనున్నారు. బేక్డ్ (వెబ్ సిరీస్, సీజన్ 3) ఏప్రిల్ 25న, ది ఆఫర్-ఏప్రిల్ 28 (వెబ్ సిరీస్) వూట్ లో స్ట్రీమింగ్ కి రానున్నారు.