Pests Damaging Banana : అరటి తోటలను నష్టపరుస్తున్న తెగుళ్లు.. నివారణకు చేపట్టాల్సిన చర్యలు

తెగులు ఆశించిన మొక్కల ఆకుల కింది నుండి పసుపు వర్ణంలోనికి మారి , ఎండిపోయి, ఆకు తొడిమ వద్ద విరిగి కాండము  వెంట వ్రేలాడుతుంటాయి. అలాగే భూమి దగ్గరగా కాండముపై నిలువుగా పగులు ఏర్పడుతుంది.

Pest Control in Banana Farming

Pests Damaging Banana : అరటిసాగులో దిగుబడులు ఆశించినంత మేర లేకపోవటానికి  ముఖ్యకారణం చీడపీడలు. ఈ తోటలకు  పురుగుల బెడద అంతగా లేనప్పటికీ శిలీంధ్రపు బూజు తెగుళ్ల బెడద ఎక్కువ.  ముఖ్యంగా  పనామా, సిగటోకా ఆకుమచ్చ, దుంపకుళ్ళు తెగుళ్లు పట్టి పీడిస్తుంటాయి. వీటి వల్ల  చెట్లు క్షీణించి, గెల దిగుబడి, కాయ నాణ్యత తగ్గిపోతుంది. ఒక్కోసారి చెట్లు చనిపోయే ప్రమాధం కూడా వుంది.  వీటిని  అధిగమించే మార్గాలు, నివారణకు సకాలంలో చెపట్టాల్సిన సస్యరక్షణా చర్యలు గురించి తెలియజేస్తున్నారు కృష్ణా జిల్లా, ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త,  డా. సుధా జాకబ్ .

READ ALSO : Tips to keep bananas fresh : అరటిపండు త్వరగా రంగు మారకుండా ఉండాలంటే ఇలా చేయండి

ఉద్యానవన పంటల్లో ప్రధానమైంది అరటి. సంవత్సరం పొడవునా నాటే అవకాశం వున్నప్పటికీ ఏప్రెల్ నుంచి ఆగష్టు మధ్యకాలంలో ఎక్కువగా నాటతారు. అరిటికి నీటి అవసరం ఎక్కువ. మొక్కలు పెరిగిన తర్వాత తోట మొత్తం నీడ వాతావరణం వుంటుంది కనుక తోటలో మైక్రో క్లైమేట్ ఏర్పడుతుంది. ఇది భూమిలో శిలీంధ్రాల అభివృద్ధికి తోడ్పడుతుంది.

మొక్కలు ఆరోగ్య వంతంగా వున్నప్పుడు  వీటి దాడి వుండనప్పటికీ, ప్రతికూల వాతావరణం, నీటి ఎద్దడి పరిస్థితులతో మొక్కలు వత్తిడికి గురైనప్పుడు అరటి మొక్కలు సులభంగా తెగుళ్లకు లొంగిపోతాయి. అరటి తోటలను ఆశించే  తెగుళ్లలో అతి ప్రమాధకరమైనది  పనామా తెగులు.  ఈ తెగులు  విత్తన పిలకల ద్వారా , మట్టి ద్వారా వ్యాపిస్తుంది.

READ ALSO : Banana Cultivation : వేసవిలో అరటి తోటల సంరక్షణ

తెగులు ఆశించిన మొక్కల ఆకుల కింది నుండి పసుపు వర్ణంలోనికి మారి , ఎండిపోయి, ఆకు తొడిమ వద్ద విరిగి కాండము  వెంట వ్రేలాడుతుంటాయి. అలాగే భూమి దగ్గరగా కాండముపై నిలువుగా పగులు ఏర్పడుతుంది. ఈ తెగులును రసాయనాల ద్వారా నివారించటం సాధ్యం కాదు. కాబట్టి ఈ తెగులును తట్టుకునే రకాలను ఎన్నుకొని  సాగుచేయాలి.

అరటిని తీవ్రంగా నష్టపరిచే మరో తెగులు దుంపకుళ్లు.  మొక్కల మొదల్లో కుళ్లుమచ్చలు ఏర్పడి క్రమేపి దుంప కుళ్లిపోతుంది. కొత్తగా నాటిన పిలకలలో, చిన్న మొక్కలలో మొవ్వు ఆకు కూడా కుళ్లి మొక్క చనిపోతుంది. పెద్దమొక్కలలో కాండంపై నిలువుగా పగుళ్లు ఏర్పడతాయి. దుంప పై భాగం కుళ్లిన వాసన వస్తుంది.

READ ALSO : Banana Crop Farming : 5 ఎకరాల అరటి సాగుతో.. రూ. 25 లక్షల ఆదాయం

అరటిలో గెలలు ఈనిన తరువాత ఎక్కువగా ఆశించే తెగులు సిగటోకా ఆకుమచ్చ తెగులు.  బూజుజాతి శిలీంధ్రం వలన వచ్చే ఈ తెగులు అన్ని కాలాల్లోనూ పంటను ఆశిస్తుంది. ముఖ్యంగా జులై నుండి నవంబర్ నెలల్లో ఈ తెగులు ఉధృతి అధికంగా ఉంటుంది. ఎక్కువగా పెద్దపచ్చ అరటి, పొట్టిపచ్చ అరటి, తెల్ల చక్కెరకేళి రకాలు ఈ తెగులుకు గురవుతుంటాయి.  ఆకులపై మొట్టమొదట చిన్న పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. క్రమేపి అవి పెరిగి పెద్దవై మధ్యలో బూడిద రంగు కలిగి ఉంటాయి. ఈ మచ్చలు గోధుమ రంగులోకి మారి ఒక దానితో ఒకటి కలిసిపోతాయి. దీనివల్ల ఆకులు ఎండిపోయి మొక్కలు క్షీణిస్తాయి.

ట్రెండింగ్ వార్తలు