Monsoon Crops : వానాకాలం పంటల సాగు.. రకాల ఎన్నిక

Monsoon Crops : వ్యవసాయ సీజన్‌ ప్రారంభమైంది. వానకాలం సాగులో రైతులు బిజీ బిజీగా ఉన్నారు. అయితే ఏ పంట ఎప్పుడు వేసుకోవాలో సరైన అవగాహన లేకపోవడంతో ప్రతి సంవత్సరం ఏదో ఒక రకమే సాగు చేస్తూ అన్నదాతలు నష్టపోతున్నారు.

Cultivation of Monsoon Crops

Monsoon Crops : వాతావరణ పరిస్థితులపై వానాకాలం పంటల సాగు ఉంటుంది. నీటి లభ్యత, విత్తే సమయం, నేల స్వభావాన్ని బట్టి పంటల ఎంపిక ఉండాలి. అయితే చాలా మంది రైతులు ఇష్టానుసారంగా రకాలను ఎంచుకొంటు సాగుచేస్తున్నారు. భూమిని, సమయాన్ని పట్టించుకోకుండా విత్తుతుండటంతో పంటలు దెబ్బతింటున్నాయి. ఈ నేపధ్యంలో.. అసలు ఎలాంటి వ్యవసాయ భూములకు ఎలాంటి పంటలు అవసరం… ఏ సమయంలో ఏఏ పంటలు వేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Read Also : Agri Tips : ఖరీఫ్‌కు అనువైన.. స్వల్పకాలిక సన్న, దొడ్డుగింజ రకాలు

వ్యవసాయ సీజన్‌ ప్రారంభమైంది. వానకాలం సాగులో రైతులు బిజీ బిజీగా ఉన్నారు. అయితే ఏ పంట ఎప్పుడు వేసుకోవాలో సరైన అవగాహన లేకపోవడంతో ప్రతి సంవత్సరం ఏదో ఒక రకమే సాగు చేస్తూ అన్నదాతలు నష్టపోతున్నారు. అదును చూసి సాగు చేయడం వల్ల తెగుళ్లు, చీడపీడల ఉధృతి నుంచి పంటను కాపాడుకోవడంతో పాటు పంట నాణ్యత పెరిగి అధిక దిగుబడి వస్తుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితి నుంచి పంట బతుకుతుంది. ఈ నేపథ్యంలో ఏ పంటలను ఎప్పుడు సాగు చేయాలి?  ఏ నేలలకు అనువైనవి అనే అంశాలను రైతులకు తెలియజేస్తున్నారు  పాలెం కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ ప్రభాకర్ రెడ్డి.

ఖరీఫ్ ప్రారంభమై నెలరోజులు అవుతుంది. ఇప్పటికే చాలా మంది పంటలను వేశారు. ముఖ్యంగా అన్ని పంటల్లో దీర్ఘకాలిక రకాలను సాగుచేశారు. ఇంకా జులై 15 వరకు పంటలను విత్తుకునే సమయం ఉంది. అయితే ఏ పంటలో ఏరకాలను ఎన్నుకుంటే మంచి దిగుబడులను తీయవచ్చో ఇప్పుడు చూద్దాం.

Read Also : Castor Farming Techniques : వర్షాధారంగా ఆముదం, వేరుశనగ సాగు

ట్రెండింగ్ వార్తలు