Paddy Crop : వరి నారుమడిలో మేలైన యాజమాన్యం

Paddy Crop : నాణ్యమైన విత్తనం, ఆరోగ్యవంతమైన  నారు, వరిలో అధిక దిగుబడికి  సోపానం. నీటి లభ్యతను బట్టి కొంతమంది రైతులు మెట్టనారుమళ్ల  పెంపకం చేపడుతుండగా. ఇప్పటికే చాలా చోట్ల నార్లు పోసుకున్నారు. 

Paddy Crop

Paddy Crop : తెలుగు రాష్ట్రాల్లో వరినారుమళ్లు  పోసే పనులు ముమ్మరంగా  కొనసాగుతున్నాయి  .  నేరుగా వరి విత్తే విధానాలు చాలా ప్రాంతాల్లో ఆచరణలో వున్నా, చాలా మంది రైతులు నారుమళ్ల ను పెంచి, నాటే పద్ధతిని ఆచరిస్తున్నారు. సాగునీటి లభ్యత తక్కువ వున్న రైతులు పొడి దుక్కిలో విత్తనం వెదజల్లుతుండగా, నీటి సౌలభ్యం వున్న రైతులు దమ్ముచేసి  నారు మళ్లు పోస్తున్నారు. అయితే ఆరోగ్యవంతమైన నారు పెరగాలంటే, నారుమడిలో ఎలాంటి యాజమాన్యం  పాటించాలో తెలియజేస్తున్నారు  ప్రధాన శాస్త్రవేత్త మానుకొండ శ్రీనివాస్.

Read Also : Agri Tips : వ్యవసాయంలో యాంత్రీకరణతో కూలీల కొరతకు చెక్ – సమయం ఆదాతో పాటు తగ్గనున్న పెట్టుబడులు 

నాణ్యమైన విత్తనం, ఆరోగ్యవంతమైన  నారు, వరిలో అధిక దిగుబడికి  సోపానం. నీటి లభ్యతను బట్టి కొంతమంది రైతులు మెట్టనారుమళ్ల  పెంపకం చేపడుతుండగా. ఇప్పటికే చాలా చోట్ల నార్లు పోసుకున్నారు.  కొన్ని చోట్ల నాట్లు వేసేందుకు నారు సిద్ధంగా ఉంది.

మరి నారు పుష్ఠిగా పెరిగి, 25 నుండి 30 రోజుల్లో అందిరావాలంటే , విత్తనశుద్ది, పోషక యాజమాన్యం తప్పనిసరి  అని సూచిస్తున్నారు నారుమడిలో చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్య పద్ధతుల గురించి రైతులకు తెలియజేస్తున్నారు మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త మానుకొండ శ్రీనివాస్.

Read Also : Agri Tips : ఖరీఫ్‌కు అనువైన.. స్వల్పకాలిక సన్న, దొడ్డుగింజ రకాలు

ట్రెండింగ్ వార్తలు