Manjeera Wildlife : జీవ వైవిద్య ప్రాంతంగా మంజీరా

Manjeera Wildlife : భూగర్భ జలాలను పెంచుతూ, వరదలను నియంత్రిస్తూ, నీటి నుంచి వ్యర్థాలను తొలగించి జీవ వైవిధ్యానికి ఎంతో తోడ్పడేవి చిత్తడి నేలలు. ఈ భూమిపై రెండు వేల నాలుగొందలు మాత్రమే ఉన్నాయి.

Manjeera Wildlife Sanctuary

Manjeera Wildlife : సంగారెడ్డి జిల్లాలోని మంజీరా అభయారణ్యానికి యునెస్కో గుర్తింపు దక్కించుకునేందుకు రాష్ట్ర అటవీశాఖ ప్రయత్నాలు చేస్తోంది. హైదరాబాద్‌ జంట నగరాలకు తాగునీటిని అందిస్తున్న మంజీరా డ్యామ్‌కు, సింగూరు ప్రాజెక్టుకు మధ్య ఉన్న జలాశయం, తొమ్మిది చిన్న ద్వీపాలతో కూడి ఉన్న ప్రాంతంలో ఈ అభయారణ్యం విస్తరించి ఉంది. మొసళ్లు సహా ఎన్నో రకాల జలచరాలు, వన్యప్రాణులు, వివిధ జాతుల పక్షులున్న ఈ ప్రాంతాన్ని జీవ వైవిధ్యమున్న చిత్తడి నేలగా గుర్తించారు. అసలు ఈ చిత్తడి నేలలను ఎవరు గుర్తిస్తారు.. వీటి వలన లాభాలేంటి.. తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే..

Read Also : Agri Tips : వ్యవసాయంలో యాంత్రీకరణతో కూలీల కొరతకు చెక్ – సమయం ఆదాతో పాటు తగ్గనున్న పెట్టుబడులు 

భూగర్భ జలాలను పెంచుతూ, వరదలను నియంత్రిస్తూ, నీటి నుంచి వ్యర్థాలను తొలగించి జీవ వైవిధ్యానికి ఎంతో తోడ్పడేవి చిత్తడి నేలలు. ఈ భూమిపై రెండు వేల నాలుగొందలు మాత్రమే ఉన్నాయి.  మన తెలుగు రాష్ట్రాల్లో  జీవ వైవిధ్య ప్రాంతంగా గుర్తింపు పొందినది ఆంధ్రప్రదేశ్ లో ఒక్కటి కొల్లేరు సరస్సు ఒకటి కాగా .. రెండోది తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లాలోని మంజీరా అభయారణ్యాన్ని ఆ లక్షణాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

మంజీరా అభయారణ్యానికి యునెస్కో గుర్తింపు సాధించేందుకు అవసరమైన అర్హతలు, ప్రతిపాదనలను శాస్త్రీయంగా సిద్ధం చేసేందుకు అటవీశాఖ , ఎన్వీరాన్‌మెంట్‌ ప్రొటెక్షన్‌ ట్రైనింగ్, రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ తో కలసి అధ్యయనం చేస్తోంది. ఈ అభయారణ్యానికి సంబంధించిన పూర్తి వివరాలు, సాంకేతిక అంశాలతో కూడిన ప్రాథమిక నివేదికను నేషనల్‌ వెట్‌ల్యాండ్‌ బోర్డుకు పంపారు.

సంగారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంలో సదాశివ, పుల్కల్, చౌటకూర్ మండలాల పరిధిలో దాదాపు 20 చదరపు కిలోమీటర్లలో ఈ అభయారణ్యం విస్తరించి ఉంది. హైదరాబాద్ నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ అభయారణ్యంలో  తొమ్మిది ద్వీపాలు ఉన్నాయి. ఇక్కడ 303 పక్షి జాతులు ఉన్నాయి , వీటిలో 117 జాతులు ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి వలస వచ్చినవి . 14 జాతుల ఉభయచరాలు, 57 రకాల చేప జాతులు, 32 రకాల సీతాకోక చిలుకలు, 25 అకశేరుకాలు ,25 ఆర్కినిడ్ లు ,28 ఓడోనేట్స్  ,31 రకాల సరీసృపాలు ఇక్కడ ఉన్నట్లు ఇప్పటికే అధికారులు గుర్తించారు. భారత్ లో రామ్ సర్ ఇప్పటి వరకు గుర్తించిన 80 చిత్తడి నేలల్లో లేని ఎన్నో ప్రత్యకతలు ఇక్కడ ఉన్నాయంటున్నారు అటవిశాఖ అధికారులు.

ఈ అద్భుత ప్రాంతానికి అంతర్జాతీయ గుర్తింపు వచ్చేలా రామ్ సర్ కన్వెన్షన్ కు ప్రతిపాధనలు ఇప్పటికే వెళ్ళాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై చొరవ చూపితే తెలంగాణలో జీవవైవిధ్య అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మంజీర చిత్తడి నేల ప్రాచుర్యంలోకి వచ్చే అవకాశం ఉంటుంది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.

Read Also : Soil Test For Agriculture : నేలకు ఆరోగ్యం.. పంటకు బలం – భూసార పరీక్షలతోనే అధిక దిగుబడులు  

ట్రెండింగ్ వార్తలు