Castor Farming Techniques : వర్షాధారంగా ఆముదం, వేరుశనగ సాగు

Castor Farming Techniques : వేరుశనగ, ఆముదం పంటల సాగు  విస్తీర్ణం ఏ ఏటికాయేడు పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా ఆముదం రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 3 లక్షల హెక్టార్లలో సాగవుతుంది. 

Verusenaga panta In Telugu

Castor Farming Techniques : దేశంలో పండించే నూనెగింజల పంటల్లో వేరుశనగ, ఆముదం సాగుకు అధిక ప్రాధాన్యత వుంది. ఒకప్పుడు ఈ పంటలను, సాగులో చిట్టచివరి అవకాశంగా భావించేవారు. కానీ నేడు పరిస్థితులు  మారాయి. అధికదిగుబడినిచ్చే వంగడాల రావడం.. నీటి ఎద్దడిని తట్టుకుని మెట్టప్రాంత రైతులకు మంచి ఆదాయ వనరుగా మారడంతో చాలా ప్రాంతాల్లో రైతులు ఈ పంటల సాగుకు మొగ్గుచూపుతున్నారు. మేలైన యాజమాన్యం చేపట్టినట్లైయితే, ఇతర వర్షాధార పంటలకు ఏమాత్రం తీసిపోదని తెలియజేస్తున్నారు పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త వాణిశ్రీ.

Read Also : Agri Tips : అంతరపంటలతో అధిక లాభాలు పొందుతున్న మాలి గిరిజనులు

వేరుశనగ, ఆముదం పంటల సాగు  విస్తీర్ణం ఏ ఏటికాయేడు పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా ఆముదం రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 3 లక్షల హెక్టార్లలో సాగవుతుంది. తెలంగాణలో మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లో సాగవుతుండగా, ఆంధ్రప్రదేశ్ లో కర్నూలు, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో దీని విస్తీర్ణం వుంది. ఆముదం నూనెను వైమానిక రంగంలో, జెట్‌, రాకెట్‌పరిశ్రమల్లో లూబ్రికెంట్‌గానూ, పాలిష్‌లు, ఆయింట్‌మెంట్లు , మందుల తయారీల్లోనూ, డీజిల్‌పంపుసెట్లలో డీజిల్‌కు ప్రత్యమ్నాయ ఇంధనంగా ఉపయోగిస్తున్నారు.

సబ్బులు, డిటర్జంట్లు వంటి వాటిల్లో కూడా వాడుతుండడంతో దేశంలో ఆముదం పంటకు ప్రాధాన్యత పెరిగింది. ఈ పంట ఉప ఉత్పత్తుల వల్ల భారత దేశానికి ఏటా 5వేల కోట్ల విదేశీ మారక ద్రవ్యం లభించటం విశేషం. అయితే ఈ ఖరీఫ్ లో రురుతుపవనాలు సమయానికి వచ్చినా… తరువాత వర్షాలు ఆలస్యం అయ్యాయి.

ఏ పంటలు విత్తని ప్రాంతాలలో ఆముదం, వేరుశనగను జులై చివరి వరకూ విత్తుకోవడానికి సమయం ఉంది. మురుగు నీరు నిల్వ ఉన్న భూములు, చౌడు భూములు తప్పా, అన్ని నేలలు ఈ పంటకు సాగుకు అనుకూలం. అయితే వర్షధారంగా సాగుచేసే ఈ పంటల్లో  కొన్ని మెళకువలు పాటిస్తే మంచి దిగుబడులను తీయవచ్చనం చెబుతున్నారు  పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త వాణిశ్రీ.

Read Also : Agri Tips : ఖరీఫ్‌కు అనువైన.. స్వల్పకాలిక సన్న, దొడ్డుగింజ రకాలు

ట్రెండింగ్ వార్తలు