High Court : తెలంగాణలో భారీ వర్షాలపై హైకోర్టులో పిల్.. వరదల్లో చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశాలు

వరదలకు సంబంధించి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై సోమవారం పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను జులై 31వ తేదీకి వాయిదా వేసింది.

High Court PIL

Heavy Rains – PIL Filed : తెలంగాణలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో భారీ వర్షాలపై కాంగ్రెస్ నేత చెరుకు సుధాకర్, శ్రావణ్ కుమార్ అనే మరో వ్యక్తి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. ఈ పిల్ పై విచారణ చేపట్టిన కోర్టు వరద బాధితులకు ఎలాంటి ఆసరా కల్పిస్తున్నారని ప్రశ్నించింది.

ఎన్నికల కోసం వార్ రూములు ఏర్పాటు చేస్తున్నారని వరదల కోసం ఎందుకు కంట్రోలో రూమ్ లు ఏర్పాటు చేయడం లేదని కోర్టు ప్రశ్నించింది. వరదల్లో చిక్కుకున్న వారి కోసం తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించింది. కడెం ప్రాజెక్టు సేప్టీకి చర్యలు తీసుకుని ప్రజల ప్రాణాలు కాపాడాలని తెలిపింది. ఇప్పటి వరకు ఎంత మందిని రక్షించారని కోర్టు ప్రశ్నించింది.

Heavy Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో మరో రెండ్రోజులు భారీ వర్షాలు.. తెలంగాణలో ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్ .. హైదరాబాద్‌ను వీడని వర్షం ..

వరదలకు సంబంధించి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై సోమవారం పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను జులై 31వ తేదీకి వాయిదా వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

రోడ్లపై వరద నీరు ప్రవహిస్తోంది. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్ లో కుండపోత వర్షం కురుస్తోంది. పలు కాలనీలు, బస్తీలు జలమయం అయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జంట జలాశయాలు నీటి కుండలా మారాయి. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ లకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.

North India : ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఢిల్లీ, ఎన్సీఆర్, నోయిడాలో లోతట్టు ప్రాంతాలు జలమయం

రెండు జలాశయాల గేట్లు ఎత్తి మూసీకి నీటిని విడుదల చేశారు. దీతో మూసీ నది పొంగి ప్రవహిస్తోంది. మూసీ పరివాహక ప్రాంతాలు వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.

ట్రెండింగ్ వార్తలు