Rain Alert : తెలంగాణలో మూడ్రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు.. 12జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతోపాటు రెండురోజుల్లో మరో అల్పపీడనం ఏర్పడనుండటంతో తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ్టి నుంచి శనివారం వరకు
- Harishth Thanniru
- Published on- July 17, 2024 / 07:17 AM IST
Heavy Rain
Heavy Rain In Telangana : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతోపాటు రెండురోజుల్లో మరో అల్పపీడనం ఏర్పడనుండటంతో తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ్టి నుంచి శనివారం వరకు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, గురు, శుక్ర, శనివారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
Also Read : Viral Video: బర్రె కోసం 10 కిలోల బంగారు చైన్ చేయించి.. దాని మెడలో వేసిన వ్యక్తి
ఇవాళ (బుధవారం) కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్ధిపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా తూర్పు, ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పలు జిల్లాల్లో 11.5 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈదురు గాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడటం, విద్యుత్ సరఫరా స్తంభించడం, లోతట్టు ప్రాంతాల్లో వరద ముంపు ఏర్పడటం వంటివి జరగవచ్చని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు చేశారు.
Also Read : సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. కేసీఆర్ పిటిషన్‌పై కీలక ఆదేశాలు
గురు, శుక్ర, శనివారాల్లో 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను వాతావరణ శాఖ జారీ చేసింది. కుమ్రంభీం ఆసిఫఆబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, అదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసిన వాతావరణ శాఖ ఆ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగిలిన జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. హైదరాబాద్ లోనూ రాబోయే నాలుగు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
