Heavy Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో మరో రెండ్రోజులు భారీ వర్షాలు.. తెలంగాణలో ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్ .. హైదరాబాద్‌ను వీడని వర్షం ..

తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.

Heavy Rain Alert

Heavy Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచికొడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు (Heavy Rains) పడుతున్నాయి. అక్కడ ఇక్కడ అని లేదు దాదాపుగా అన్ని చోట్ల వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం స్థంభించింది. తెలంగాణ (Telangana), ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. తెలంగాణలో మాత్రం అన్ని జిల్లాల్లో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. కుండపోత వర్షాలతో దాదాపు అన్ని జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా ప్రధాన రహదారులపైకి నీరుచేరి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు తెలంగాణలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు మరోసారి రెడ్ అలర్ట్ జారీచేశారు.

Hyderabad Vijayawada Highway : హైదరాబాద్- విజయవాడ హైవేపైకి వరద నీరు.. ఏపీ, తెలంగాణ మధ్య నిలిచిన రాకపోకలు

తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఖమ్మం, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, మెదక్, కామారెడ్డి, కరీంనగర్, జగిత్యాల జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే పలు జిల్లాల్లో మున్నేరులు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. 22 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. అదిలాబాద్, నిర్మల్, కుమురం భీమ్, మంచిర్యాల, ములుగు, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, వరంగల్, హమబూబాబాద్, సిద్ధిపేట, జనగామ, నల్గొండ, రంగారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల, మహబూబ్ నగర్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నారాయణపేట, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది.

మరోవైపు హైదరాబాద్ లోనూ వర్షం దంచికొడుతుంది. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో పలు ప్రాంతాలు జలదిగ్భందంలో ఉండిపోయాయి. జీహెచ్ఎంసీ అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హైదరాబాద్ లో శుక్రవారం కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Operation Moranchapalli : నీట మునిగిన గ్రామం.. రంగంలోకి ఆర్మీ హెలికాప్టర్లు, 70మంది సేఫ్

మరోవైపు ఏపీలోనూ పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాబోయే మూడు రోజులు ఉత్తరకోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం దక్షిణ కోస్తా రాయలసీమలో వర్షాలతో పాటు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే మినహా బయటకు రావొద్దని హెచ్చరిలు జారీ అయ్యాయి.

మరోవైపు హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై వరద ప్రవాహం కొనసాగుతోంది. మున్నేరు వాగు ఉద్ధృతితో కృష్ణా జిల్లా కీసర టోల్‌గేట్ సమీపంలోని ఐతవరం వద్ద గురువారం సాయంత్రం నుంచి వాహనాల రాకపోకలు నిలిపివేసిన విషయం తెలిసిందే. శుక్రవారం ఉదయమూ అదే పరిస్థితి కొనసాగింది. సుమారు 2 కిలో మీటర్ల మేర వాహనాలు రహదారిపై నిలిచిపోయాయి. దీంతో పలు మార్గాల్లో వాహనాలను అధికారులు తరలిస్తున్నారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు