Operation Moranchapalli : నీట మునిగిన గ్రామం.. రంగంలోకి ఆర్మీ హెలికాప్టర్లు, 70మంది సేఫ్

200లకు పైగా కుటుంబాలు ఉన్న మోరంచపల్లి గ్రామాన్ని వాగు ముంచెత్తింది. గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది. Moranchapalli Floods

Operation Moranchapalli

Moranchapalli Floods : భూపాలపల్లి జిల్లా మోరంచపల్లిలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఫైర్ డిపార్ట్ మెంట్స్ తో పాటు రెండు ఆర్మీ హెలికాప్టర్లు రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్నాయి. మోరంచపల్లిలో వరదలో చిక్కుకున్న 70మందిని రెస్క్యూ సిబ్బంది కాపాడారు. జలదిగ్బంధంలో చిక్కుకున్న మోరంచపల్లి గ్రామాన్ని ఖాళీ చేయించారు అధికారులు. బోటు సాయంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మోరంచ వాగులో చిక్కుకున్న ఆరుగురు కూలీలను హెలికాప్టర్ల సాయంతో కాపాడారు.

Also Read..Heavy Rains : హైదరాబాద్- విజయవాడ హైవేపైకి వరద నీరు.. ఏపీ, తెలంగాణ మధ్య నిలిచిన రాకపోకలు

రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు భూపాలపల్లి జిల్లా అతలాకుతలం అవుతోంది. 200లకు పైగా కుటుంబాలు ఉన్న మోరంచపల్లి గ్రామాన్ని వాగు ముంచెత్తింది. దీంతో మోరంచపల్లి గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఇళ్లపైకి ఎక్కిన గ్రామస్తులు తమను రక్షించాలని ఆర్తనాదాలు చేశారు. రంగంలోకి దిగిన సహాయక సిబ్బంది గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

48 గంటలుగా కురుస్తున్న భారీ వర్షాలతో జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని మోరంచపల్లి జలదిగ్బంధంలో చిక్కుకుంది. గ్రామ శివారులో ఉన్న వాగులోకి భారీగా వాన నీరు చేరి గ్రామాన్ని వరద ముంచెత్తింది. తెల్లవారుజామున గ్రామస్తులు నిద్ర లేచే సరికి వరద నీరు ఇళ్లలోకి చేరింది. దీంతో జనం భయాందోళనకు గురయ్యారు. తమను కాపాడాలంటూ ఇళ్ల మిద్దెలపైకి ఎక్కి ఆర్తనాదాలు చేశారు.

సమాచారం అందుకున్న అధికారులు గ్రామస్తులను రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టారు. ముంపు ప్రాంతం నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతానికి బోట్ల ద్వారా తరలించారు. తొలుత బోట్ల ద్వారా బాధితుల తరలింపు ప్రక్రియ చేపట్టగా.. వరద ప్రవాహం తీవ్రంగా ఉండటంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రెండు ఆర్మీ హెలికాఫ్టర్లను రంగంలోకి దించారు. దీంతో వేగంగా తరలింపు ప్రక్రియ చేపట్టారు.

వరదలో ఇంకా ఎవరైనా చిక్కుకున్నారేమోననని సహాయక బృందాలు ఆర్మీ హెలికాప్టర్లతో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. సహాయక చర్యల్లో సాధారణ హెలికాప్టర్‌ వినియోగించడం కష్టంగా మారడంతో సైన్యంతో చర్చలు జరిపారు. సైన్యం అంగీకారం తెలపడంతో ఆర్మీకి చెందిన రెండు హెలికాప్టర్లను ప్రభుత్వం మోరంచపల్లి గ్రామానికి పంపి సహాయక చర్యలు చేపట్టింది. ఊరి ప్రజలను సురక్షితంగా పునరావాస కేంద్రానికి తరలించాయి. వారందరికి వసతి, భోజన సదుపాయాలు కల్పించారు అధికారులు.

ట్రెండింగ్ వార్తలు