Dheeraj Mogilineni : పెద్ద సినిమాలకు ఎంతైనా పెట్టి టికెట్ కొంటారు.. కానీ చిన్న సినిమాలకు మాత్రం.. నిర్మాత సంచలన వ్యాఖ్యలు..

పేకమేడలు సినిమా జులై 19న రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించారు మూవీ యూనిట్. పేకమేడలు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చిన నిర్మాత ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ..

Dheeraj Mogilineni Sensational Comments in Peka Medalu Pre Release Event

Peka Medalu Pre Release Event : పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన వినోద్ కిషన్ హీరోగా పేకమేడలు సినిమాతో రాబోతున్నాడు. రాకేష్ వర్రే క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో పేకమేడలు సినిమా తెరకెక్కగా వినోద్ కిషన్ హీరోగా అనూష కృష్ణ, రితిక శ్రీనివాస్, జగన్ యోగి రాజ్, అనూష నూతల, గణేష్ తిప్పరాజు, నరేన్ యాదవ్.. పలువురు ముఖ్య పాత్రల్లో నటించారు. ఇప్పటికే పేకమేడలు సినిమా నుంచి టీజర్, సాంగ్స్, ట్రైలర్ రిలీజ్ చేసి మంచి అంచనాలు నెలకొల్పారు.

పేకమేడలు సినిమా జులై 19న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే పలు పెయిడ్ ప్రీమియర్ షోలు వేసి 50 రూపాయలకే టికెట్స్ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించారు మూవీ యూనిట్. పేకమేడలు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చిన నిర్మాత ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ.. ఈ సినిమా చూసాను. నాకు నచ్చి ఇంకా బాగా ప్రమోట్ చేయొచ్చు అనిపించింది. ఇలాంటి సినిమాని బాగా ప్రమోట్ చేస్తేనే మంచి హిట్ అవుతుంది. పెద్ద సినిమాలు ఏ రేట్ పెట్టినా థియేటర్ కు వస్తారు కానీ చిన్న సినిమాలు తక్కువ రేట్లు ఉంటే కానీ రారు. అందుకే ఈ సినిమా టికెట్ రేటుని 100 రూపాయలే పెట్టాము. ప్రీమియర్స్ 50 రూపాయలకే పెట్టాము. పెద్ద సినిమాలతో పోటీ పడలేక చిన్న సినిమాలు ఇబ్బందులు పడుతున్నాయి అని అన్నారు.

Also Read : Kajal Aggarwal Son : కొడుకు కోసం కాజల్ అగర్వాల్.. స్పెషల్ గా రూమ్ ఎలా డిజైన్ చేయించిందో చూడండి..

డైరెక్టర్ నీలగిరి మామిళ్ల మాట్లాడుతూ.. పెయిడ్ ప్రీమియర్స్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. డైరెక్టర్ గా సినిమా పైన చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను అని అన్నారు. నిర్మాత రాకేష్ వర్రే మాట్లాడుతూ.. ఈ సినిమా రిలీజ్ అనుకున్నప్పట్నుంచి అందరూ సపోర్ట్ చేస్తున్నారు. ప్రమోషన్స్ చాలా కొత్తగా చేసాము. పెయిడ్ ప్రీమియర్స్ అన్ని ఫుల్ అయిపోయాయి. మా మూవీ టీమ్ ని అందరూ గుర్తుపడుతున్నారు. ధీరజ్ నాతో ఉన్న మంచి పరిచయం కారణంగా ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నాడు. ఈ సినిమాకు రానా దగ్గుబాటి, అడివి శేష్, విశ్వక్ సేన్ చాలా సపోర్ట్ చేసారు, వాళ్లకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అని అన్నారు.

ఇక ఈ పేకమేడలు సినిమా.. పనిపాట లేకుండా జీవితంలో పగటి కలలు కంటూ భార్య సంపాదన మీద బతికే ఓ వ్యక్తి జాబ్ లో జాయిన్ అయి అక్కడ ఒక అమ్మాయి పరిచయమయితే తన లైఫ్ ఎలా మారింది? భార్యాభర్తల మధ్య గొడవలు ఎందుకొచ్చాయి అనే ఆసక్తికర కథతో కామెడీ, ఎమోషనల్ గా చూపించబోతున్నారు.

ట్రెండింగ్ వార్తలు